భూమా ఫ్యామిలీతో మంచు వియ్యం : మంచు మనోజ్ వివాహం - రాజకీయ ఎంట్రీ .!!?
ఏపీలో మరో రెండు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ఒక్కటి కానున్నాయా. భూమా ఫ్యామిలీతో మంచు కుటుంబం వియ్యం అందుకోనుందా. ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు...వ్యాఖ్యలు అవుననే చెబుతున్నాయి. పెదరాయుడు మోహన్ బాబు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబం భూమా ఫ్యామిలీతో వియ్యానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ తాజాగా భూమా మౌనికా రెడ్డి తో హైదరాబాద్ నగరంలోని సీతాఫల్ మండి వద్ద ఉన్న గణేష్ మండపం లో పూజలు నిర్వహించారు.
మౌనికా తో మనోజ్ వివాహం..!
భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె.. మాజీ మంత్రి అఖిల ప్రియ సోదరి అయిన మౌనిక రెడ్డికి..మనోజ్ కు వివాహం జరగనుందనే వార్తల ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మనోజ్, ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కారణాలు బయటకు రాకపోయినా.. ఆ తరువాత ఆ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
అప్పటి నుండి సింగిల్‌గానే ఉంటున్న మంచు మనోజ్.. ఇప్పుడు మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. భూమా మౌనికతో వివాహం గురించి అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు ఆకస్మికంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అయితే, అది రాజకీయ సమావేశం కాదని చెప్పారు.

చంద్రబాబు - మోహన్ బాబు చర్చల్లోనే
చిత్తూరు జిల్లాలో రంగంపేట శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం గురించి మాట్లాడడానికి మాత్రమే చంద్రబాబుని కలిశానని మోహన్ బాబు చెప్పారు. అయితే, ఆ భేటీ సమయంలో మంచు మనోజ్ వివాహం గురించి చర్చకు వచ్చి ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
భూమా శోభా - భూమా నాగిరెడ్డి మరణం తరువాత అఖిల ఆ కుటుంబం లో రాజకీయంగా టీడీపీ నుంచి మంత్రిగా పని చేసారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనూ..టీడీపీ నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకొనేందుకు అఖిల - మౌనిక ఇద్దరూ టీడీపీ కోసం పని చేసారు. అయితే, తాజాగా మౌనిక తో కలిసి గణేష్ మండపం దగ్గరకు రావటం పైన స్పందించిన మంచు మనోజ్ తన వివాహం తో పాటుగా రాజకీయ ఎంట్రీ గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తానని వెల్లడించారు. మౌనిక ప్రస్తుతం రాజకీయంగా టీడీపీతో దగ్గరగా ఉంటున్నారు.

టీడీపీలోకా.. బీజేపీలోకి ఎంట్రీ ఇస్తారా
కానీ, మనోజ్ బీజేపీ వైపు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తనంతటగా తాను రాజకీయ అంశాలను ప్రస్తావించటం ద్వారా..మౌనిక వివాహం ద్వారా టీడీపీలోకే ఎంట్రీ ఇస్తారనే ప్రచారం సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మనోజ్ రాజకీయంగా క్రియాశీలకంగా మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అటు మనోజ్ సోదరుడు మంచు విష్ణు "మా" అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు వైసీపీకి అనుకూలంగా పని చేసారు. జగన్ తో బంధుత్వం ఉన్న మోహన్ బాబు.. ప్రస్తుతం కొంత దూరంగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. మంచు కుటుంబం ఢిల్లీలో ప్రధానితోనూ సమావేశమైందది. దీంతో.. ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ వివాహం.. రాజకీయ ఎంట్రీ అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications