ప్రకటనతో మోసం: నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత (పిక్చర్స్)

హైదరాబాద్: బీఎండబ్ల్యూ కారు అమ్మకానికి ఉందని ప్రకటన ఇచ్చి హైదరాబాదులోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి 18 లక్షల 63 వేల రూపాయలను దోచుకున్న కేసుకు సంబంధించి నలుగురు నైజీరియన్లతో పాటు ముగ్గురు ముంబై వాసులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను క్రైమ్స్‌ అదనపు ఉపకమిషనర్‌ బి.శ్రీనివాసరెడ్డి గురువారం వెల్లడించారు.

నైజీరియా దేశానికి చెందిన పాస్కల్‌ ఇమ్మాన్యుల్‌ మెడికల్‌ వీసాపై కొంతకాలం క్రితం ముంబై వచ్చాడు. తర్వాత అదే దేశానికి చెందిన పాల్‌ ఒసేం వుజీ, ఒలెక్‌పే సన్‌డే ఓన్యేజ్‌బులా, టోనీ చినేదు నిజ్‌వుతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఆన్‌లైన్‌లో వాహనాల అమ్మకాలకు సంబంధించి నకిలీ ప్రకటనలు ఇచ్చి, లక్షలాది రూపాయలు దోచుకోవడం చేస్తుండేవారు. ముంబైలో వివిధ బ్యాంక్‌లలో ఖాతాలు తెరవడానికి సాజిద అబ్దుల్‌ హమిద్‌, తాళ్ల మోజెస్‌ను ఉపయోగించుకున్నారు.

కొద్దినెలల క్రితం నైజీరియన్‌ గ్యాంగ్‌ క్వికర్‌ డాట్‌ కాంలో ముంబైలో బీఎండబ్ల్యూ కారు అమ్మకానికి ఉందని ప్రకటన ఇచ్చింది. ఇతర వివరాల కోసం సంప్రదించడానికి పాల్‌ ఒసేం వుజీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. ప్రకటన చూసి ఎల్‌బీనగర్‌కు చెందిన షేక్‌ జిలానీ బాషా పాల్‌కు ఫోన్‌ చేశాడు. ‘నేను అమెకరిన్‌ కాన్సులేట్‌ కార్యాలయంలో పనిచేస్తున్నాను. నేను తిరిగి ఆ దేశానికి వెళ్లిపోతున్నా. నాకు ఇక్కడ బీఎండబ్ల్యూ 520డి 5 సిరీస్‌ కారు ఉంది. దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను' అని పాల్‌ బాషాను నమ్మించాడు.

ప్రస్తుతం ఈ కారు ముంబై విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారుల వద్ద ఉందని చెప్పాడు. ముందుగా డెమరేజస్‌ చార్జీలుగా లక్షా 50 వేల రూపాయలు చెల్లించాలన్నాడు. ఈ విషయంలోనూ బాషాను నమ్మించడానికి సాజిద అబ్దుల్‌ హమిద్‌... సంజనాసింగ్‌ అనే మారుపేర్లతో కస్టమ్స్‌ అధికారిగా ఫోన్‌ చేసింది. అధికారులకు సుంకం చెల్లించాలని చెప్పి అనేక దఫాలుగా వివిధ బ్యాంకుల్లో 18 లక్షల 63 వేల రూపాయలను డిపాజిట్‌ చేయించుకున్నారు. రోజులు గడుస్తున్నా కారుకు సంబంధించిన సమాచారం రాకపోకపోవడంతో బాషాకు అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. మోసాన్ని గ్రహించిన అతడు ఏడో తేదీన సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

కారు అమ్మకానికి ఉందనే ప్రకటనతో మోసం చేసిననలుగురు నైజీరియన్లతో పాటు ఇద్దరు ముంబై వాసులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎసెంట్‌ కారుతో పాటు ల్యాప్‌టాప్‌, రెండు టాబ్లెట్లు, 19 సెల్‌ఫోన్లు, 19 సిమ్‌ కార్డులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నైజీరియన్‌ గ్యాంగ్‌ ముంబైలో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌లలో కరెంటు ఖాతాలను తెరిచింది. ఈ ఖాతాలన్నీ ఆనంద్‌ ఇన్ఫర్మేటిక్స్‌, రోహిత్‌ సౌత్‌, మహేంద్ర రాథోడ్‌, నఫీజ్‌ పేరుతో ఉన్నాయి. వీటిలో ఆనంద్‌ ఇన్ఫర్మేటిక్స్‌ పేరుతో ఉన్న ఖాతాలో రెండు నెలల్లో మొత్తం 20 లక్షల లావాదేవీలు నిర్వహించారు.

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నిందితుల్లో సాజిద అధికారిగా ఫోన్లలో మాట్లాడుతుంది. టోనీ చినేదు ఖాతాల్లో ఉన్న డబ్బును డ్రా చేసి ప్రధాన సూత్రధారి పాస్కల్‌ ఇమ్మాన్యుల్‌కు అందజేస్తాడు. అతడు మిగిలిన వారికి 5 నుంచి పది శాతం కమీషన్‌ ఇస్తాడు.

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

కరెంట్‌ ఖాతా నిర్వహించడంలో లాభం ఉంది. ఖాతా ఒక బ్యాంక్‌ శాఖలో ఉన్నా... ఇతర శాఖల నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఆ కారణంగానే కరెంటు ఖాతాలను నైజీరియన్లు మారుపేర్లతో తెరుస్తుంటారు. ఒ

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

నైజీరియన్ గ్యాంగ్ పట్టివేత

కసారి ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ అయ్యాయని తెలియగానే కమీషన్లు పంచేసి తమ అవసరాలకు కొంత మొత్తాన్ని దగ్గర పెట్టుకుని మిగిలిన డబ్బులను లండన్‌ లేక నైజీరియన్‌ దేశాల్లో ఉన్న ఖాతాల్లో జమ చేస్తారని ఓ అధికారి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+