విరాళం ప్రకటించిన మెగా డాటర్..తెలంగాణకు జీరో..ఏపీకి ఎంతంటే..?
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ హీరోలందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రభాస్ మరోసారి రెండు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.1 కోటి, తెలంగాణకు రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల సాయాన్ని ప్రకటించారు.మహేష్ బాబు ఏపీ, తెలంగాణ ఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం ప్రకటించారు. జూ.ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి విరాళం చేశారు.
విశ్వక్ సేన్ రెండు రాష్ట్రాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. రాష్ట్రానికి రూ.15 లక్షల చొప్పున సిధ్ధూ జొన్నలగడ్డ రూ. 30 లక్షల విరాళం సీఎం సహాయనిధికి అందించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతలైన రాధాకృష్ణ, నాగవంశీ. ముగ్గురు కలిపి రెండు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం అందజేశారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు నిర్మాత అశ్వినీదత్. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం అందజేశారు.

తాజాగా మెగా డాటర్ నిహారిక సైతం ఏపీకి విరాళం ప్రకటించారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ గా మారింది.విజయవాడలో వరద ముప్పుకి గురైన 10 గ్రామాలకు గ్రామానికి 50,000 చొప్పున ఈమె ఐదు లక్షల విరాళం అందించినట్టు తెలిపారు. తాను పట్టణంలోనే పుట్టి, పెరిగినా తన పెద్దవాళ్లు మాత్రం ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు.ఆ అనుభవాల దృష్ట్యా గ్రామీణ వాతావరణం పై అభిమానం ఏర్పడింది. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో పాటు తన కుటుంబీకులందరూ కూడా ఎంతో అండగా నిలిచారు
ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా అనిపిస్తుందని నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ కుటుంబం నుంచి కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా అందించారు తాజాగా నిహారిక కూడా తనవంతుగా ఐదు లక్షలు విరాళం ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఏపీతో పాటు తెలంగాణను కూడా భారీ వర్షాలు ముంచేత్తాయి. కానీ నిహారిక ఒక్క ఏపీకే విరాళం ప్రకటించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ప్రకటించకపోవడంతో నిహారిక తెలంగాణ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీలో హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్, చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి వారందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం అందించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications