ఇతర హీరోలు అసూయ చెందేలా... నిఖిల్
నిఖిల్ సిద్దార్థ.. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ హీరోపేరు అందరి నోళ్లలో నానుతోంది. టాలీవుడ్ లో ఉన్న ఇతర యంగ్ హీరోలు కూడా అసూయపడేలా తన లైనప్ ను నిఖిల్ సెట్ చేసుకున్నారు. 'కార్తికేయ-2' పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలవడంతో నిఖిల్ కు క్రేజ్ పెరిగింది. ఎంచుకున్న కథల కాన్వాస్, బడ్జెట్, మార్కెట్ కూడా వేరే రేంజ్ లో ఉన్నాయి.
ఇటీవలే విడుదలైన 'స్పై' టీజర్ చూసిన తర్వాత ఈ సినిమా వేరే రేంజ్ కు వెళుతుందనిపించేలా ఉంది. 'ది ఇండియా హౌస్' కూడా భారీ సినిమా అయ్యే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా నిఖిల్ కొత్త చిత్రం 'స్వయంభు'పై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రేక్షకులతోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారికి కూడా ఒకరకంగా సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. యుద్ధ వీరుడిగా నిఖిల్ ను చూపిస్తూ ఒక సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు.

ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. తమిళనాడుకు చెందిన అతడికి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. రచయితగా తమిళంలో కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. చోళుల నేపథ్యంలో ఒక ఆసక్తికర యుద్ధవీరుడి కథను సిద్ధం చేసుకొని నిర్మాత ఠాగూర్ మధును సంప్రదించాడు. అప్పటికే నిఖిల్ డేట్లున్న మధు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా చేస్తున్నాడు.
కథంతా తమిళ వాసన వస్తుండటంతోపాటు చోళుల నేపథ్యంలో మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు ఇప్పటికే ప్రేక్షకులను పలకరించాయి. దీంతో బింబిసార రచయిత వాసుదేవ్ సహకారంతో చోళుల కనెక్షన్ తీసేశారు. ఒక ఫిక్షనల్ స్టోరీగా మార్పు చేశారు. అన్నీ సిద్ధమయ్యాక ఈ సినిమాను ప్రకటించారు. ఆగస్టులో సెట్స్ మీదకు వెళ్లే స్వయంభుకు మనోజ్ పరమహంస, రవి బస్రూర్ లాంటి టాప్ టెక్నీషియన్లు రంగంలోకి దిగారు. ఇది కూడా నిఖిల్ కు కలిసిరానుంది.












Click it and Unblock the Notifications