సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం: నిమ్మగడ్డ లేఖపై సీబీఐ విచారణ: కేంద్రానికి సిఫార్సు...!

అమరావతి: వదల బొమ్మాళీ..వదల..అంటూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరు పైన ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల వాయిదా..సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణిగిన వ్యవహారం ఇప్పుడు నిమ్మగడ్డ రాసిన లేఖగా వైరల్ అయిన లెటర్ పైన ఇప్పుడు ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఆ లేఖలో ఉన్న అంశాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తమ ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా భావిస్తున్న క్రమంలో ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోకూడదని..దీని పైన సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపు లు సైతం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.

 సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం..

సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సమర్ధిస్తూ తీర్పు ఇచ్చిన కాసేటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో బయటకు వచ్చిన లేఖ సంచలనంగా మారింది. అందులో తనకు కేంద్ర బలగాల తో భద్రత కల్పించాలని కోరటంతో పాటుగా..స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ...ప్రభుత్వ తీరును తప్పు బడుతూ అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. ఆ లేఖ తాను రాయలేదని వివరణ ఇచ్చినట్లుగా రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చినట్లు జాతీయ వార్తా సంస్థలు ప్రకటించాయి. దీని పైన వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ లేఖ నిమ్మగడ్డ రమేష్ పేరుతో టీడీపీ విడుదల చేసిందని..టీడీపీ మద్దతు మీడియా ప్రతినిధుల ద్వారా బయటకు వచ్చిందని ఫైర్ అయ్యారు.

 ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం జగన్

ఆ లేఖ తొలుత రమేష్ కుమార్ వ్యక్తిగత మెయిల్ నుండే కేంద్ర హోం శాఖకు వెళ్లిందనే సమాచారం వైసీపీ నేతలకు అందింది. అయితే, లేఖను పూర్తిగా పరిశీలించిన తరువాత దీని వెనుక కుట్ర జరిగిందనే అభిప్రాయానికి వచ్చారు. దీంతో.. ఇప్పటికే దీని పైన వైసీపీ నేతలు దీని వెనుక ఏం జరిగింది..అసలు ఈ లేఖ నిజంగా రమేష్ కుమార్ రాసారా లేక టీడీపీ ప్రచారంలోకి తీసుకొచ్చిందా అనేది విచారణ చేయాలని డీజీపీని కోరారు. ఇక, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా భావిస్తున్న సమయంలో ఈ మొత్తం లేఖ వ్యవహారాన్ని సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు..

కేంద్ర హోం శాఖతో సంప్రదింపులు..

ముఖ్యమంత్రి జగన్ ఈ లేఖ వ్యవహారం పైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని..డీజీపీ సవాంగ్ తో పాటుగా నిఘా చీఫ్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ముఖ్యులతోనూ మంతనాలు జరిపారు. డీజీపీకి దీని పైన ఫిర్యాదు ఇవ్వటం..విచారణ చేయటం రాష్ట్ర స్థాయిలో చేస్తూనే...దీని పైన కేంద్ర హోం శాఖకు సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కేంద్ర హోం శాఖ అధికారులతో సైతం సంప్రదింపులు జరిపినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల కమిషనర్ తాను ఎటువంటి లేఖ రాయలేదని ఒక జాతీయ వార్త సంస్థకు వివరణ ఇచ్చినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది.

Recommended Video

    Coronavirus In India : Paracetamol Sufficient For COVID 19, Trolls On KCR And Jagan
     ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందన్న భావన

    ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందన్న భావన

    దీంతో..రాజ్యంగబద్ద మైన పదవిలో ఉన్న వ్యక్తి లెటర్ హెడ్...సంతకం తో ఆ లేఖ ఎవరు రాసారు..ఎవరు ప్రచారంలోకి తెచ్చారనేది బయటకు తేవాలని..ఇది తమ ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్రగా ప్రభుత్వ పెద్దలు బావిస్తున్నారు. దీంతో..దీనిని రాష్ట్ర స్థాయిలో విచారణతో పాటుగా సీబీఐ విచారణకు ఇస్తేనే పూర్తి స్థాయిలో సమాచారం వస్తుందని..నిజంగా టీడీపీ పాత్ర ఉంటే జాతీయ స్థాయిలో దానిని బయట పెట్టాలని యోచిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. ఇప్పటికే రమేష్ కుమార్ కార్యాలయంతో పాటుగా నివాసం వద్ద కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసారు. ఈ రోజు సీబీఐ విచారణ విషయం పైన ప్రభుత్వం అధికారికంగా స్పందించే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+