పాలకొల్లు నుండి అసెంబ్లీకి నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర; జగన్ ప్రభుత్వానికి డిమాండ్ ఇదే!!

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర మొదలు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి అమరావతిలోని అసెంబ్లీకి సైకిల్ యాత్ర చేపట్టిన రామానాయుడు జగన్ సర్కార్ పై ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు.

పాలకొల్లు నుండి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర

నిమ్మల రామానాయుడు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి వరకు సాగనుంది. సైకిల్ యాత్ర చేపట్టిన నిమ్మల రామానాయుడు కు టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజా రమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురొచ్చారు. పాలకొల్లు లాకుల వద్ద శ్రీ దేశాలమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం నిమ్మల రామానాయుడు తన సైకిల్ యాత్రను మొదలు పెట్టారు.

టిడ్కో గృహాలు ఉచితంగా లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్

పూలపల్లి వద్ద నిమ్మలకు మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. నిమ్మల సైకిల్ యాత్రలో పాలకోడేరు, భీమవరం, వీరవాసరం, ఉండి మండల కేంద్రాల్లో నాయకులు పూలమాలలు వేసి నిమ్మల రామానాయుడుకు స్వాగతం పలికారు. వీరవాసరం మండల కేంద్రంలో టిడిపి, జనసేన నాయకులు, ఉండిలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, టిడిపి నాయకులు నిమ్మల రామానాయుడుకి స్వాగతం పలికారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి టిడ్కో గృహాల లబ్ధిదారులను మోసం చేస్తున్నారని, నిర్మాణం పూర్తయిన ఫ్లాట్ లను వారికి వెంటనే అందజేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిమ్మల ఈ సైకిల్ యాత్ర చేపట్టారు.

జగన్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల

జగన్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల

ప్రతి లబ్దిదారునికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం మత్తు వదిలించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నాడు ఉచితమని నేడు బ్యాంకు రుణాలతో లబ్ధిదారులను ముంచుతున్న జగన్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నంలో భాగంగానే సైకిల్ యాత్ర చేస్తున్నట్టు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజల కష్టాలు, ఇష్టాలు తెలియకుండా పరిపాలన సాగిస్తున్నాడు అంటూ మండిపడ్డారు. అందరూ ఉచితంగా ఇళ్లల్లో ప్రవేశించేవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు.

చంద్రబాబు కట్టిన ఇళ్ళకు జగన్ పార్టీ రంగులు అవసరమా?

చంద్రబాబు కట్టిన ఇళ్ళకు జగన్ పార్టీ రంగులు అవసరమా?

పేదల ఇళ్ల పై రంగులు వేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించిన నిమ్మల రామానాయుడు, ఒక వేళ రంగులు వేయాలనుకుంటే తాడేపల్లి రాజప్రాసాదానికి, లోటస్ పాండ్ కు, ఇడుపులపాయ ఎస్టేట్ కు వేసుకోవాలని నిమ్మల సెటైర్లు వేశారు. ఒక్క ఇటుక కూడా పెట్టని జగన్ కు చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్లకు పార్టీ రంగులు వేయడం అవసరమా అంటూ నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.గత ప్రభుత్వ హయాంలో 90% ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం చేయలేకపోతోంది నిమ్మల రామానాయుడు విమర్శించారు.

Recommended Video

    Climate Change : మానవాళికి ముప్పు | IPCC వార్నింగ్ | Heatwaves || Oneindia Telugu
    టీడీపీ అసెంబ్లీని బహిష్కరిస్తే చీఫ్ సెక్రటరీని కలుస్తా

    టీడీపీ అసెంబ్లీని బహిష్కరిస్తే చీఫ్ సెక్రటరీని కలుస్తా

    రంగుల మీద ఉన్న మమకారం పేదల ఇళ్లు పూర్తి చేయడంపై జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ళను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారని కానీ నేడు బలవంతంగా బ్యాంకు రుణాల పేరు చెప్పి ఫ్లాట్లను అమ్ముకుంటున్నారు అంటూ నిమ్మల ఆరోపించారు. రేపు జిల్లా కలెక్టర్ ను కలుస్తానని, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీని బహిష్కరిస్తే చీఫ్ సెక్రటరీకి మెమోరాండం ఇస్తానని నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+