తిరుపతిలో సందడి చేసిన నటి నిత్యా మీనన్(పిక్చర్స్)
తిరుపతి: మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ షో' తనకెంతో నచ్చిందని, నగర ప్రజలను కూడా ఆకట్టుకుంటుందని ప్రముఖ సినీనటి నిత్యా మీనన్ అన్నారు. శనివారం స్థానిక ప్రకాశం రోడ్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ షో'ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అనేక రకాలైన బంగారం, వజ్రాభరణాలు, జాతిరత్నాలతో తయారు చేసిన ఆభరణాలు బాగున్నాయన్నారు.
అంతకుముందు ఆర్టీస్ట్రీ ఆభరణాలను ఆవిష్కరించి ప్రదర్శించారు. తమ డ్రీమ్ రోల్స్ అన్ని ఇప్పటికే తనకు వచ్చాయని ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. అనంతరం మలబార్ గోల్డ్ ప్రతినిధి కళ్యాణ్ రాం మాట్లాడుతూ.. వినూత్నంగా తీర్చిదిద్ది అత్యాధునికమైన డిజైన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వజ్రాలు, అన్‌కట్ వజ్రాల ధరపై 15శాతం తగ్గింపును జులై 19వ తేదీ వరకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, మలబార్ గోల్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, నిత్యా మీనన్‌ను చూసేందుకు అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.

నిత్య మీనన్
మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ షో' తనకెంతో నచ్చిందని, నగర ప్రజలను కూడా ఆకట్టుకుంటుందని ప్రముఖ సినీనటి నిత్యా మీనన్ అన్నారు.

నిత్య మీనన్
శనివారం స్థానిక ప్రకాశం రోడ్డులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ‘ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెలరీ షో'ను ఆమె ప్రారంభించారు.

నిత్య మీనన్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అనేక రకాలైన బంగారం, వజ్రాభరణాలు, జాతిరత్నాలతో తయారు చేసిన ఆభరణాలు బాగున్నాయన్నారు.

నిత్య మీనన్
ఈ సంస్థతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. సంస్థ ఒక్క వ్యాపారానికే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications