కేంద్రం తాజా నిర్ణయం తో అమరావతిలో కీలక మలుపు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్దికంగా తోడ్పాటు పై అభ్యర్దించారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఏపీకి కేంద్ర ప్రాజెక్టుల పైన చర్చలు చేసారు. అమరావతి నిర్మాణం లో భాగంగా కేంద్రం నుంచి కావల్సిన మద్దతు పై నివేదిక ఇచ్చారు. ఈ సమయంలో కేంద్రం కీలక హామీ ఇచ్చింది. అమరావతి నిర్మాణంలో ఈ నిర్ణయం కీలకం కానుంది.
అమరావతిపై కసరత్తు
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. అమరావతి ప్రస్తుత పరిస్థితుల పైన కేంద్రానికి నివేదించారు. కేంద్ర శాఖల నుంచి సహకారం కోరారు. అమరావతిలో మౌళిక వసతుల కల్పనలో భాగంగా ముందుగా రోడ్ల నిర్మాణం పైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తో చంద్రబాబు సమావేశమైన సమయంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన రహదారులపై ఆయనకు ప్రతిపాదనలు సమర్పించారు. అమరావతి ఔటర్, ఇన్నర్ రింగ్‌రోడ్డుతోపాటు, విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిసే తూర్పు బైపాస్ చేపట్టాలన్న చంద్రబాబు విన్నపానికి గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

ఏపీకి కేంద్రం హామీ
అమరావతి రాజధానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిమీ పొడవైన ఓఆర్‌ఆర్‌ను తానే చేపట్టేందుకు ముందుకొచ్చింది. పెరిగిన ట్రాఫిక్, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్ నిర్మాణం చేద్దామని నితిన్ గడ్కరీ సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీఇచ్చారు. ఖర్చు ఎంతైనా అమరావతికి అద్భుతమైన రహదారిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఔటర్ నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రూ.18 వేల కోట్లతో దీన్ని నిర్మించాలని 2017-18లోనే ప్రతిపాదించగా కేంద్రం అప్పట్లోనే అంగీకరించింది.
I also met with Union Minister @nitin_gadkari Ji in Delhi today to discuss 𝙉𝙖𝙩𝙞𝙤𝙣𝙖𝙡 𝙃𝙞𝙜𝙝𝙬𝙖𝙮 𝙥𝙧𝙤𝙟𝙚𝙘𝙩𝙨 𝙞𝙣 our State. I'm confident that together, we shall take Andhra Pradesh further on the road to progress and prosperity. https://t.co/VF0AJ6C8zJ
— N Chandrababu Naidu (@ncbn) July 4, 2024
మౌళిక వసతుల పై ఫోకస్
ప్రజలకు, మౌలిక రంగం మరింత బలోపేతమయ్యేందుకు అవసరమైన సహకారమందిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ఆ 3ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ నేపథ్యంలో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లు రూపొందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలో 7 వేల కిమీపైనే జాతీయ రహదారులున్నాయి. ప్రస్తుతం స్టేట్ హైవేలుగాఉన్న 3,200 కిమీ రోడ్లను కూడా జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని గడ్కరీకి చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏపీలో కూడా కొత్తగా చేపట్టే పెద్ద ప్రాజెక్టులు, జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి సీసీ టెక్నాలజీతో నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలని గడ్కరీ సూచించారు.
-
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications