కిరణ్ రెడ్డి కన్నా నిజాం గొప్ప: కోదండరామ్ కితాబు

కలిసి ఉంటే కష్టాలు తప్ప ఒరిగేదేమిలేదనీ, అందుకే తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై శానససభలో చర్చకు ఇచ్చిన వారం రోజుల గడువుతో నష్టం లేదని, పార్లమెంట్‌లో టి బిల్లు పాసవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం మెదక్ మండలం సర్దన జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి కోదండరామ్ ప్రసంగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే భాష ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టు నీళ్లు రాక బోర్లు వేసుకున్నా విద్యుత్ లేక పంటలు పండక అప్పులు చేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి దృష్టిలో రైతుల బాగు ఇదేనా అని ప్రశ్నించారు. నిజాం పాలనలో నిరంకుశమైన రాచరికం నడిచిందన్నారు. 1956 ఆంధ్రాతో కలిస్తే ఒక్క ఒప్పందం అమలుకాకపోగా సర్వనాశనమయ్యామని ఆయన అన్నారు.. 1990 నుండి ఘన్‌పూర్ ఆనకట్ట కింద గల మహబూబ్‌నహర్ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications