చంద్రబాబుకు షాక్: బెజవాడలో ఆఫీస్‌కు అమెరికా కాన్సులేట్ నో

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో కార్యాలయం ఏర్పాటుకు అమెరికా కాన్సులేట్ తిరస్కరించింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) అభిప్రాయాన్ని తోసిపుచ్చుతూ విజయవాడలో కార్యాలయాన్ని తెరిచే ఆలోచన లేదని అమెరికా కాన్సులేట్ స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా కాన్సులేట్ జనరల్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది.

ఇటీవలి మీడియా వార్తాకథనాలకు ప్రతిస్పందిస్తూ భారతదేశంలో కొత్తగా అణెరికా ప్రభుత్వ సౌకార్యాలను ఏర్పాటు చేయడం లేదని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. సచివాలయంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారని ఆంధ్రప్రదేశ్ సిఎంవో కమ్యూనికేషన్స్ సలహాదారు కార్యాలయం ఇటీవల ప్రకటన విడుదల చేసింది.

 No Andhra Pradesh office: US Consulate

అమెరికా ప్రతినిధులు పునీత్ తల్వార్, అతుల్ కేశప్, కెన్నెత్ హ్యాండిల్‌మన్ ఇటీవల చంద్రబాబును హైదరాబాదులోని సచివాలయంలో కలిశారు. విజయవాడలో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా వారిని కోరారు. రాష్ట్రంలోని ఈ ప్రాంతం నుంచి చాలా మంది అమెరికా వెళ్తున్నారని, అందువల్ల విజయవాడలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆయన వారితో చెప్పారు.

విజయవాడ శాఖా కార్యాలయం ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆ ప్రతినిధులు చంద్రబాబుతో చెప్పారు. కానీ, విజయవాడలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం లేదని తాజా ప్రకటన తెలియజేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+