ఢిల్లీలో జగన్‌కు షాక్ మీద షాక్: నో చెప్పిన కేంద్రమంత్రులు
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతోంది. విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లగా.. ఆయన చంద్రబాబుకు కితాబిచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు జగన్‌కు షాకిచ్చారు. వీరిద్దరితో భేటీ కోసం జగన్ అపాయింటుమెంట్ అడిగారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. అసలు.. జగన్‌తో భేటీకి వారు నిరాకరించినట్లుగా కూడా చెబుతున్నారు.
చంద్రబాబు పనితనం: జగన్‌కు ప్రణబ్ షాకిచ్చారా?
కాగా, వైయస్ జగన్ అంతకుముందు వరుసగా ఢిల్లీ పెద్దలతో సమావేశమైన విషయం తెలిసిందే. మంగళవారం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని జగన్ కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో తాము వెనకాడబోమన్నారు.
తమ పోరాటాన్ని విడవబోమన్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సాక్షిగా నాడు ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనని, లేదంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోలేమన్నారు.
పార్లమెంట్ విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హోదాపై తాము ఏపీలో పోరాటాన్ని కొనసాగిస్తూనే ఇతర పార్టీలను ఈ ఉద్యమంలో కలుపుకుని ముందుకు వెళతామని జగన్ తెలిపారు. కేంద్రంపై ప్రత్యేక హోదా అంశంలో ఒత్తిడి తీసుకువస్తామన్నారు.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా పరాభవాలు ఎదురవుతున్నాయి.

కేంద్రమంత్రులు
ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీలు జగన్‌కు షాకిచ్చారు. వీరిద్దరితో భేటీ కోసం జగన్ అపాయింటుమెంట్ అడిగారు. అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.

రాష్ట్రపతి
సోమవారం నాడు పార్టీ ఎంపీలతో కలిసి వైయస్ జగన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశసించిన రాష్ట్రపతి జగన్‌కు ఝలక్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.

సీతారాం ఏచూరీ
వైయస్ జగన్ అంతకుముందు వరుసగా ఢిల్లీ పెద్దలతో సమావేశమైన విషయం తెలిసిందే. మంగళవారం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని జగన్ కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో తాము వెనకాడబోమన్నారు.












Click it and Unblock the Notifications