రుద్రమదేవి: ప్రశ్నించడమే తప్పా, క్షమాపణ కోరిన గుణశేఖర్
Recommended Video

అమరావతి: రుద్రమదేవి సినిమాకు ఎలాంటి కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని సినీ దర్శకుడు గుణశేఖర్ ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ళ పాటు ప్రకటించిన నంది అవార్డుల విషయమై గుణశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు దర్శకుడు గుణశేఖర్ బుదవారం నాడు లేఖ రాశారు.
రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను ఎందుకు మినహాయింపు ఇవ్వలేదని ప్రశ్నించడం తప్పా అంటూ గుణశేఖర్ ప్రశ్నించారు.అంతేకాదు 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి వినోదపు మినహాయింపు ఇచ్చి తన చిత్రానికి ఎందుకివ్వలేదని గతంలో ఆయన ప్రశ్నించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో రుద్రమదేవికి చోటు దక్కలేదు.
ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 2014, 15,16, సంవత్సరాల అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా వాళ్లని మూడేళ్లపాటు అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారనే అభిప్రాయాన్ని గుణశేఖర్ వ్యంగ్యాస్త్రాలు ట్విట్టర్ వేదికగా సంధించారు.

ప్రశ్నించడమే తప్పా
రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను మినహాయించాలని ఏపీ ప్రభుత్వానికి గుణశేఖర్ కోరారు. అయితే ఆ సమయంలో ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను రాయితీ ఇవ్వలేదు. ఇటీవల విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వడంపై కూడ చంద్రబాబునాయుడును గుణశేఖర్ ప్రశ్నించారు. ఆ సమయంలో ఈ విషయమై వివాదమే చోటు చేసుకొంది.

రుద్రమదేవి సినిమా జ్యూరీ గుర్తింపు దక్కదా
ఏపీ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డులను ప్రకటించింది. అయితే ఈ అవార్డుల జాబితాలో రుద్రమదేవికి చోటు దక్కలేదు. ఈ సినిమాను కనీసం జ్యూరీ గుర్తింపుకు కూడ నోచుకోలేదని గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రశ్నించినందునే ఈ రకంగా జరిగిందనే అభిప్రాయాన్ని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఆవేదనను గుణశేఖర్ వ్యక్తం చేశారు.

మహిళా సాధికారిత సినిమాకు ఇచ్చే గౌరవమిదేనా
అసలు మనం ఏ దేశంలో ఉన్నాం..? స్వతంత్ర భారతంలోనేనా..? మహిళా సాధికారతని చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి' ఎందుకు మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎంపిక కాలేకపోయింది..? కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో గుణశేఖర్ ప్రశ్నించారు.

రుద్రమదేవి సినిమా తీసినందుకు క్షమాపణ
ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారా..?. అదే అయితే ‘‘ రుద్రమదేవి'' లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి'' అని చంద్రబాబుకు రాసిన లేఖలో గుణశేఖర్ కోరారు.












Click it and Unblock the Notifications