టిడిపిలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు లేవు:చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Triple talaq bill passed in Lok Sabha, Video

  అమరావతి: ట్రిపుల్‌ తలాక్ బిల్లుపై టిడిపిలో ఎలాంటి బిన్నాభిప్రాయాలు లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.ఈ విషయమై అభిప్రాయాలను సేకరించినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

  అమరావతిలో శుక్రవారం నాడు చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ముస్లిం పురుషులు 46 శాతం, ముస్లిం మహిళలు సుమారు 56 శాతం మద్దతిచ్చారని ఆయన చెప్పారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అందరూ మద్దతుగా నిలిచారని ఆయన చెప్పారు. ఈ బిల్లుపై తమ పార్టీలో బిన్నాభిప్రాయాలు లేనేలేవని చంద్రబాబునాయుడు చెప్పారు.

  No different opinion in the TDP on Triple Talaq Bill: Chandrababu naidu

  జనవరి రెండు నుంచి ఐదో విడత జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు చంద్రబాబు చెప్పారు10 రోజల పాటు జన్మభూమి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. పండుగ వాతావరణంలో జన్మభూమి కార్యక్రమాలు జరగాలని అధికారులకు ఆయన సూచించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

  కొత్తగా పెన్షన్లు, రేషన్‌కార్డులు అర్హులకు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రన్న బీమా పరిహార చెక్కులు అందజేస్తామన్నారు. 6వేల జన్మభూమి- మా ఊరు సభలు నిర్వహిస్తామన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has said that there is no different opinion in the TDP on Triple Talaq Bill. chandrababu naidu was spoke to media on Friday at Amaravathi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి