రుణమాఫీ: ఏపీలో 5.82 లక్షల రైతులకు షాక్, తర్వాతే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రుణమాఫీ పథకం నుండి 5.82 లక్షల ఖాతాలు తిరస్కారానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఖాతాదారులు తమ అర్హతకు సంబంధించి బ్యాంకులకు ఎలాంటి సమాచారము ఇవ్వకపోవడంతో తొలిదశలోనే వీటిని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రైతు రుణమాఫీ డేటా విభాగానికి సుమారు 80 లక్షల ఖాతాల వివరాలు అందాయి. అందులో 5,82,703 మంది ఖాతాదారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గుర్తించారు. మిగిలిన వాటిలో 15 లక్షల ఖాతాదారులు ఆధార్ సంఖ్య, రేషన్ కార్డు వివరాలు రెండూ పొందుపరచలేదు.
మరో 2.5 లక్షల ఖాదాలకు సంబంధఇంచి రేషన్ కార్డు, వివరాలున్నా ఆధార్ సంఖ్యలు లేవు. మరో 7.2 లక్షల ఖాతాలకు ఆధార్ సంఖ్య ఉన్నా రేషన్ కార్డు వివరాలు లేవు. అర్హుల జాబితా ఖరారు చేసిన తర్వాత ఈ ఖాతాల వివరాన్నింటిని జన్మభూమి కమిటీలతో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయిస్తారు.

రుణగ్రహీతల నుండి ఆధార్, రేషన్ కార్డుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇవి రెండూ లేకుంటే ఓటర్ గుర్తింపు కార్డుతో మిగతా వివరాలను సరిపోల్చి వారికి అర్హత ఉందో లేదో తేలుస్తారు. సదరు రైతు పేరుకు జన్మభూమి కమిటీ ఆమోదముద్ర వేసిన తర్వాత చివరగా తహసీల్దారు ధ్రవీకరిస్తారు.
ఈ తనిఖీల తర్వాత అర్హులుగా తేలితే వారికి రుణ ఉపశమన లబ్ధి వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తుది జాబితా విడుదల చేసిన తర్వాత అయిదు రోజుల్లో ఇదంతా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రుణమాఫీ ఉపశమనం కోసం ప్రభత్వం అడిగిన వివరాలన్నీ ఇచ్చిన రైతుల సంఖ్య 49.37 లక్షలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో బహుళ ఖాతాదారులు ఎంతమంది ఉన్నారో లెక్కతేల్చే పనిలో పడ్డారు. వీరిని కుటుంబాలవారిగా విభచించి అంతిమంగా రుణ విముక్తికి ఎంపిక చేస్తారు. తుది జాబితా పైైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల విభాగం దృష్టికి తీసుకెళ్లడానికి అయిదు రోజుల సమయం ఇస్తారు.












Click it and Unblock the Notifications