చంద్రబాబుకు మమతా బెనర్జీ ఘన స్వాగతం, నవంబర్ 22 భేటీ వాయిదా
కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. చంద్రబాబు విజయవాడ నుంచి నేరుగా కోల్‌కతా చేరుకున్నారు.
నాబన్నాలో మమతా బెనర్జీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. బీజేపీయేతర పార్టీల ఏకీకరణ కోసం ఆయన మమతతో చర్చిస్తున్నారు. జాతీయస్థాయిలో రూపొందించాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తారు.
Kolkata: Andhra Pradesh CM Chandrababu Naidu reaches Nabanna; he was received by West Bengal CM Mamata Banerjee. pic.twitter.com/SDAjR6CLvT
— ANI (@ANI) November 19, 2018

మరోవైపు, ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో జరగాల్సిన బీజేపీయేతర పక్షాల సమావేశం వాయిదా పడింది. డిసెంబర్ మొదటి వారంలో బీజేపీయేతర పక్షాల సమావేశం ఉండే అవకాశముంది.












Click it and Unblock the Notifications