చిరు పగటి వేషాలని విజయమ్మ, షర్మిల ఫైర్ (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే విభజన గురించి ప్రస్థావించే దమ్ము ఎవరికీ ఉండేది కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. కర్నూలు జిల్లా డోన్ పాతబస్టాండ్‌లో ఆదివారం జరిగిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు.
తొమ్మిదేళ్ల పాలనలో రైతులు, ప్రజల గురించి పట్టించుకోని చంద్రబాబు ఉచిత హామీలివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించని బాబు సచ్చీలురా? అని ప్రశ్నించారు. వెన్నుపోటు బాబుకు పర్యాయ పదమని ఎద్దేవా చేశారు.
వైయస్ హయాంలో రాష్ట్రంలో స్వర్ణయుగం నడిచిందన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు అన్నదాతలను లక్షలాదికారులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి అడిగే దమ్ము ఎవ్వరికీ లేదన్నారు. విభజనకు చంద్రబాబే కారకుడని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు
ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేశారని, విభజనను అడ్డుకోవడంలో కేంద్ర మంత్రులు ఘోరంగా విఫలమయ్యారని వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ పాలనలో పేదల కోసం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయన్నారు. ఆ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు. చిరంజీవివి పగటి వేషాలని విజయమ్మ మండిపడ్డారు.

వైయస్ జగన్
అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజునే ఐదు సంతకాలు చేసి రాష్ట్ర చరిత్రనే మార్చివేస్తానని జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుషోలో ఆయన ప్రసంగించారు. పాఠశాలకెళ్లే పిల్లాడికి రూ.500, ఇద్దరు పిల్లలుంటే రూ.వెయ్యి చొప్పున మహిళల ఖాతాల్లో వేసేలా అమ్మఒడి పథకంపై మొదటి సంతకం చేస్తానని చెప్పారు. రూ.700కు పింఛను పెంపు, రూ.3వేల కోట్లతో రైతులకు స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రజలకు అవసరమైన ఇళ్లు, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులను 24 గంటల్లోనే మంజూరు చేసేందుకు వార్డుల్లో కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేస్తానన్నారు.

రోడ్డు షో
2019 నాటికి కరెంటు కోత లేని రాష్ట్రంగా సీమాంధ్రను తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తానంటూ ప్రజలను బాబు మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైయస్ పాలన సువర్ణయుగమని, ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెస్తామన్నారు.

షర్మిల
వైయస్ మృతి చెందిన తరువాత రాష్ట్రం అతలాకుతలం అయిందని షర్మిల మండిపడ్డారు. గుంటూరు జిల్లా బాపట్లలో రోడ్‌షోలో ప్రసంగించారు. కిరణ్ పాలనలో ధరలు అధికమై ప్రజలు అనేక కష్టనష్టాలు అనుభవించారన్నారు. ఇంత దారుణంగా పరిపాలించిన కాంగ్రెస్ కాళ్లు విరగొట్టాల్సిన చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications