పవన్‌కు క్రెడిట్ ఇవ్వని చిరు, బాబు హామీపై రఘువీరా

హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి విజయానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా తోడయిందని స్వయంగా ఆ పార్టీలే చెబుతూ.. పవర్ స్టార్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న నేపథ్యంలో... ఆ క్రెడిట్ తన సోదరుడికి ఇచ్చేందుకు చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

సోమవారం చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ వైఫల్యం పైన స్పందించారు. పవన్ కళ్యాణ్ ప్రభావం కాంగ్రెసు పార్టీ పైన పడలేదని ఆయన చెప్పారు. తమ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

No Pawan Kalyan affect on Congress: Chiranjeevi

బాబు మాట నిలబెట్టుకుంటారు: రఘువీరా

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన హామీలను నిలబెట్టుకుంటారని భావిస్తున్నామని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి చెప్పారు. రైతులు రుణమాఫీ పైన ఆందోళన చెందవద్దన్నారు. బాబు మాట నిలబెట్టుకుంటారన్నారు. రుణమాఫీని టిడిపి తక్షణమే అమలు చేయాలన్నారు.

రైతులకు రుణమాఫీ చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరుతామన్నారు. చంద్రబాబు రుణమాఫీ పైనే తొలి సంతకం చేయాలన్నారు. తాము ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసినా పోటీ చేశామని చెప్పారు. ఓటమి భయంతో తాము జెసి దివాకర్ రెడ్డిలా పారిపోలేదని ఎద్దేవా చేశారు.

మెడికల్ ఎంట్రన్స్ పాత పద్ధతిలోనే: బొత్స

మెడికల్ ఎంట్రెన్స్ పాత పద్ధతిలోనే నిర్వహించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రయివేటు మాఫియా చేతుల్లోకి ఎంసెట్‌ను వెళ్లనివ్వద్దన్నారు. విద్యార్థులు, యువతకు అండగా ఉంటామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

ఓటమిపై సమీక్ష

సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఓటమి పైన సమీక్షపార్టీ కార్యకలాపాలు సీమాంధ్రలోనే నిర్వహించాలని వారు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+