ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 1న దేవాలయాల్లో పూజలకు నో పర్మిషన్!
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంగ్లేయులు అలవాటు చేసిన నూతన సంత్సరాదిని నిర్వహించుకోవటం భారతీయ వైదిక విధానం కాదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అందుకే కొత్త సంవత్సరం రోజున ఆలయాల్ని అలంకరించటం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయటం, శుభాకాంక్షలు తెలపడం సరికాదని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సందేశం పంపారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సూచించారు.
ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు సహాయక కమిషనర్లు, ఉప కమిషనర్లు, మేనేజర్లకు సమాచారమిచ్చారు.












Click it and Unblock the Notifications