ఆశ్చర్యంగా ఉందే.. మనదేశంలో రైలు లేని రాష్ట్రం ఉందా?
అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైల్వేను మించిన ప్రయాణ సాధనం లేదు. భారతీయుల జీవనాడిగా రైల్వే మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైన రైలు ప్రయాణం చేస్తారు. ప్రతిరోజు 2.3 కోట్ల మంది రాకపోకలు సాగిస్తున్నారు. అతి పెద్ద నెట్ వర్క్ కలిగిన దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది.
1853 లో ప్రారంభమైన భారతీయ రైల్వేల ప్రస్థానం ఈ 180 సంవత్సరాల్లో ఎంతోదూరం విస్తరించింది. దేశవ్యాప్తంగా 1.15 లక్షల కిలోమీటర్ల పొడవును రైల్వేలైన్లు కలిగివున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. పొగబండిగా ప్రారంభమైన రైలు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల వరకు విస్తరించింది. నిర్విరామంగా కొనసాగుతున్న వీటి ప్రస్థానంలో ఆశ్చర్యకరమైన విషయం కూడా ఉంది.

ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో ఇప్పటివరకు రైల్వే లైను లేదు. ఇక్కడి ప్రజలు ఇంతవరకు రైలు కూత వినలేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజం. మనదేశంలోని సిక్కిం రాష్ట్రానికి రైల్వే లైన్ లేదా? అనే ప్రశ్న తలెత్తుతుంది. సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేలు ఇతర ప్రయాణ సాధనాలతో పోల్చిచూస్తే ఖర్చు పరంగా చవకైనవి.
180 ఏళ్ల భారతీయ రైల్వేల చరిత్రలో ఇప్పటికీ రైల్వే లైన్ లేని రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. త్వరలోనే ఆ రాష్ట్రంలో కూడా రైలు పరుగులు తీయనుంది. దీనిక సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 నుంచి సిక్కింలో రైలు సేవలు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications