వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌కు షోకాజ్ నోటీసివ్వం: డిగ్గీ, జగన్‌పై టిడిపి ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ఇతర ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు, అసెంబ్లీ సమావేశాల పొడిగింపునకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

No show cause to Kiran: Diggy

జగన్ పార్టీ డ్రామా కంపెనీ: దూళిపాళ్ల

శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డు తగలడంపై సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. సమైక్యవాదుల ప్రసంగాలను అడ్డుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్రామా కంపెనీగా మారిందన్నారు. సమైక్య ముసుగులో విభజనకు జగన్ అంగీకరిస్తున్నారన్నరు.

సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటు పొడవద్దన్నారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధి ఉంటే సమైక్యవాదులతో కలిసి పని చేయాలని జగన్‌కు సూచించారు. జగన్ సైకోలా ప్రవర్తిస్తున్నారన్నారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశమైన అనంతరం మొదటిసారి వాయిదా పడింది. సీమాంధ్ర టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వర రావు, దూళిపాళ్ల నరేంద్రలు మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Wednesday said High Command will not give show cause notice to CM Kiran Kumar Reddy and MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X