అజ్ఞాతవాసికి ఏపీ 'ప్రత్యేక' అనుమతి, జూ.ఎన్టీఆర్ సినిమాపై మాత్రం ఇలా, కానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఓకే చెప్పింది. రోజుకు నాలుగు సినిమాలకు తోడు మరో మూడు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది.

పూనమ్‌ను లాగి మరో తప్పు: మహేష్ కత్తికి యాంకర్ దిమ్మతిరిగే షాక్, మీరెవరికి తెలుసు?

దీంతో రోజుకు ఒక్కో థియేటర్లో రోజుకు ఏడు షోలు ప్రదర్శించబడతాయి. సాధారణంగా ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు నాలుగు షోలు ఉంటాయి. అర్ధరాత్రి ఒకటి గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా ప్రత్యేకంగా మూడు షోలకు అనుమతించింది.

 అజ్ఞాతవాసికి ఓకే, జైలవకుశకు నో

అజ్ఞాతవాసికి ఓకే, జైలవకుశకు నో

అజ్ఞాతవాసి సినిమాకు మరో మూడు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కొందరు గత ఏడాది విడుదలైన జై లవ కుశ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జై లవ కుశ ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని గుర్తు చేస్తున్నారు. ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక షోలకు నిరాకరించింది.

'అజ్ఞాతవాసి'లో పవన్ క్యారెక్టర్ ఇదే..!
 సోషల్ మీడియాలో పోస్టులు

సోషల్ మీడియాలో పోస్టులు

జై లవ కుశ సినిమా ప్రత్యేక షోలకు చంద్రబాబు ప్రభుత్వం నిరాకరించిందని, కానీ అజ్ఞాతవాసి సినిమాకు జనవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అనుమతి ఇచ్చిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 జైసింహాకు కూడా నో చెప్పిన ఏపీ ప్రభుత్వం

జైసింహాకు కూడా నో చెప్పిన ఏపీ ప్రభుత్వం

ఇక్కడ, మరో విషయం కూడా ఉంది. అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక షోలకు అనుమతించిన ప్రభుత్వం.. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నటించిన జైసింహా చిత్రానుకు మాత్రం ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరించింది. బాలకృష్ణ స్వయంగా చంద్రబాబు బావమరిది. ఎమ్మెల్యే.

 అంతకుముందు ఈ సినిమాలకు ఇచ్చారు

అంతకుముందు ఈ సినిమాలకు ఇచ్చారు

అయితే, అంతకుముందు గౌతమీపుత్ర శాతకర్ణి ప్రత్యేక షోలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణతో పాటు ఏపీలో అనుమతించారు. అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చిన బాహుబలి చిత్రానికి కూడా ప్రత్యేక షోలకు అనుమతించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
No special show for JLK and Jai Simha in Andhra Pradesh. Andhra Pradesh Government give permission to Pawan Kalyan's Agnathavasi film for special show.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి