పరిటాల శ్రీరామ్‌కి షాకిచ్చిన చంద్రబాబు
ఏపీలో కూటమి సీట్ల ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ నుంచి ఒక్క పేరును ప్రకటించింది లేదు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు ఎక్కువుగా ఉండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠ అన్ని పార్టీల నాయకుల్లో కనిపించింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ అధిష్టానం తమకు కేటాయించిన 10 మంది ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించింది.
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..
ఎచ్చెర్ల - ఎన్ ఈశ్వర రావు
విశాఖపట్నం నార్త్ - విష్ణు కుమార్ రాజు
అరకు లోయ - పంగి రాజారావు
అనపర్తి - ఎం.శివ కృష్ణం రాజు
కైకలూరు - కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
బద్వేల్ - బొజ్జా రోశన్న
జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి
ఆదోని - పార్థసారథి
ధర్మవరం - వై.సత్యకుమార్
ఇదిలా ఉంటే ధర్మవరం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పరిటాల శ్రీరామ్‌కు మొండిచేయి ఎదురైంది. పరిటాల శ్రీరామ్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరంలో టీడీపీని నడిపించే నాయకులు లేకపోతే పరిటాల శ్రీరామ్ అక్కడకు వెళ్లి బాధ్యతలు తీసుకున్నారనే విషయాన్ని పరిటాల శ్రీరామ్ అనుచరులు పార్టీ అధినేతకు గుర్తు చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్ వచ్చిన తరువాతే ధర్మవరంలో పార్టీ పరిస్థితులు మారాయని..పార్టీని గాడిలో పెట్టడమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఎన్నో పోరాటాలు చేసి పార్టీని బలోపేతం చేశారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి టికెట్ వేరే వ్యక్తికి కేటాయించడాన్ని పరిటాల శ్రీరామ్ అనుచరులు తప్పుపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తీరుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల్లో ఓడిపోయిన పరిటాల శ్రీరామ్‌కు ఈ ఎన్నికలు చాలా కీలకం. పరిటాల రవి తనయుడుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ఇక్కడితో ఆగిపోయినట్టే అని నియోజవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఇక్కడ టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్, బీజేపీ నుంచి వరదాపురం సూరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. టికెట్‌పై ఇరువురు నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ప్రధాని మోదీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బీజేపీ జాతీయ సెక్రటరీ సత్యకుమార్‌కే ధర్మవరం టికెట్ దక్కింది. సత్యకుమార్ 34 ఏళ్ల నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. మోదీ, అమిత్ షా సన్నిహితుడిగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications