కేశినేని నానికి ఈసారి నో టికెట్ ? కేశినేని చిన్ని క్లారిటీ..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన వారిలో దాదాపు 60 మందికి ఈసారి సీట్లు లేవని ఇప్పటికే వైఎస్ జగన్ ఇన్ ఛార్జ్ ల మార్పుతో తేల్చేశారు. అలాగే ఇతర పార్టీల తరఫున గెలిచి వైసీపీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సైతం పలు చోట్ల టికెట్లు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి కూడా ఈసారి టికెట్ లేనట్లేనన్న ప్రచారం జరుగుతోంది.
Recommended Video

దీనిపై ఇవాళ ఆయన సోదరుడు, విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఇన్ ఛార్జ్ కూడా అయిన కేశినేని చిన్ని స్పందించారు.వైసీపీ నుంచి ఈసారి కేశినాని నానికి టికెట్ రాదంటూ చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వైసీపీ ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల మార్పుల నాలుగో జాబితాలో విజయవాడ పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గా కేశినేని నానిని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో నానికి బదులు ఆయన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎంపీ కేశినేని నానికి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని టీడీపీ నేత కేశినేని చిన్ని మండిపడ్డారు.కుక్కలకు విశ్వాసం అయినా ఉంటుందని, కానీ నానికి అది కూడా లేదన్నారు. ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారని నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీలో నానికి ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నానికి వైసీపీలో ఎవరూ దొరక్క దేవినేని అవినాష్ అనుచరుడిగా మారిపోయారన్నారు. కేశినేని నానికి వైసీపీలో ఇంకెవరి తోడు దొరకట్లేదన్నారు. ప్రజా జీవితం నుంచి కేశినేని నాని కనుమరుగవటం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications