చంద్రబాబు నిర్ణయం - గెలవని మీకెందుకు టికెట్ : కొత్త పంచాయితీ..!?

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ప్రతీ సీటు ఇప్పుడు కీలకంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖాయమని చెప్పిన చంద్రబాబు.. మిగిలిన సీట్ల పైన ఆచూతూచి వ్యవహరిస్తున్నార. పొత్తుల సంగతి తేలే వరకు వేచి చూసే ధోరణితో ఉన్నారు. యువతకు 50 శాతం సీట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగా కొందరు సీనియర్లకు పక్కన పెడుతున్నారు. ఇప్పుడు తుని విషయంలో చంద్రబాబు దాదాపుగా యనమల సోదరుడి విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఆ యనమల సోదరులపైన ఈ నిర్ణయం ప్రభావం చూపుతోంది. యనమల రామక్రిష్ణుడు ఇదే సమయంలో తాజా ప్రతిపాదన చేసారు. అది సోదరుడు క్రిష్ణుడికి నచ్చటం లేదు. దీనికి సంబంధించి ఒక ఆడియో వైరల్ అవుతోంది.

తుని విషయంలో క్లారిటీతో చంద్రబాబు

తుని విషయంలో క్లారిటీతో చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం పై చంద్రబాబు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణ సోదరుడు యనమల క్రిష్ణుడుకు టీడీపీ సీటు కేటాయించింది. అయితే, రెండు సార్లు ఆయన ఓడిపోయారు. దీంతో, ఈ సారి ఆయనకు సీటు ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తన సోదరుడికి కాకపోతే..తన కుమార్తెకు సీటు ఇవ్వాలని యనమల పార్టీ అధినేత వద్ద తాజాగా ప్రతిపాదన చేసారు. దీని పైన చంద్రబాబు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, సోదరుడు క్రిష్ణుడుకు మాత్రం సీటు లేదనే విషయం అర్దమై పోయింది. క్రిష్టుడు పోటీ చేసిన రెండు సార్లు అక్కడ వైసీపీ గెలిచింది. ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా తుని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కుమార్తెకు సీటు ప్రతిపాదన..తమ్ముడి అసహనం

కుమార్తెకు సీటు ప్రతిపాదన..తమ్ముడి అసహనం


యనమల తమ్ముడికి సీటు ఇస్తే గెలిచే అవకాశం లేదని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. దీంతో, తన కుటుంబానికే సీటు దక్కేలా యనమల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడికి కాకుండా కుమార్తె దివ్యకు సీటు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇది తమ్ముడు క్రిష్ణుడుకు నచ్చలేదు. ఈ ప్రతిపాదన వద్దంటూ అన్నపైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలతో యనమల క్రిష్ణుడు ఫోన్ చేసిన మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. నియోజవకర్గంలోని తొండంగి కి చెందిన పార్టీ నేతకు ఫోన్ చేసి తాను లేకపోతే నియోజకవర్గంలో టీడీపీ లేదనే విషయాన్ని అన్న యనమల రామక్రిష్ణుడికి చెప్పాలంటూ తమ్ముడు క్రిష్ణుడు కోరారు. తాను నెగ్గకపోయినా పార్టీని నిలబెట్టిన విషయం చెప్పాలని కోరుతున్నారు. ప్రతీ ఊరి నుంచి 40 మంది చొప్పున వచ్చిన యనమల రామక్రిష్ణుడుని కలవాలని..తనకు మద్దతుగా మాట్లాడాని అభ్యర్ధిస్తున్నారు. ఈ ఆడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

గెలవలేరు..సీటు ఎందుకన్నారంటూ

గెలవలేరు..సీటు ఎందుకన్నారంటూ


యనమల కుటుంబానికి సీటు ఇవ్వరనే ప్రచారం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో బలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే వచ్చే ఏడాది రాజ్యసభలో వచ్చే సీట్లలో యనమలకు కేటాయిస్తారని చెబుతున్నారు. అయితే, యనమల మాత్రం తన పెద్ద కుమార్తె దివ్యకు అసెంబ్లీ సీటు దక్కించుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యనమల కుటుంబానికి సీటు ఇస్తే గెలుస్తారా లేదా అనే అంశం పైన ఇప్పటికే సర్వే చేయిస్తన్నట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు యనమల తన కుమార్తె కోసం.. సోదరుడు క్రిష్ణుడు తనకు సీటు ఇవ్వాలంటూ పార్టీ నేతలతో మంతనాల వేళ..పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి జిల్లా టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+