వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: పవన్ కళ్యాణ్ 'డిప్యూటీ సీఎం' డిమాండ్, జగన్ ఓకే? తేల్చేసిన వైసిపి

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRC Is Planning To Tie Up With The Jana Sena పవన్ కళ్యాణ్ 'డిప్యూటీ సీఎం' డిమాండ్ | Oneindia Telugu

విజయవాడ: వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. 2019 ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని చెప్పారు.

చదవండి: రంగంలోకి పవన్ కళ్యాణ్, భయంతో దారుణమైన ప్రచారం!

 పొత్తుపై తేల్చిన ప్రశాంత్ కిషోర్ టీమ్

పొత్తుపై తేల్చిన ప్రశాంత్ కిషోర్ టీమ్

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని వైసిపి అధినేత జగన్‌కు సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రశాంత్ కిషోర్ టీమ్ ఖండించింది.

 పవన్, జగన్ మధ్య చర్చలు అంటూ

పవన్, జగన్ మధ్య చర్చలు అంటూ

జనసేనతో వైసిపి పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని కొన్ని టీవీ ఛానల్స్ చెప్పాయి. పవన్ కళ్యాణ్ - జగన్ మధ్య చర్చలకు కూడా ఆస్కారం ఉందని కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇవన్నీ ట్రాష్ అని వైసిపి కొట్టి పారేసింది.

పవన్ కళ్యాణ్ పదవి కోరారని ప్రచారం

పవన్ కళ్యాణ్ పదవి కోరారని ప్రచారం

మరో ఆసక్తికర విషయం కూడా వెలుగు చూసింది. ఈ మేరకు ఇలా ప్రచారం జరుగుతోందంటూ ఆంగ్ల మీడియాలో వార్త వచ్చింది. 2019 ఎన్నికల్లో కలిసి ముందుకు సాగుదామని, అయితే పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని జనసేన వైసిపి అధినేతకు చెప్పిందని ప్రచారం సాగుతోందని రాసింది.

మంత్రి పదవులు కూడా అడిగారని ప్రచారం

మంత్రి పదవులు కూడా అడిగారని ప్రచారం

2019లో గెలిస్తే జగన్ సీఎం అయితే పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు జనసేన ఎమ్మెల్యేలకు కొందరికి మంత్రి పదవులు కేటాయించాలని కూడా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నట్లు పేర్కొంది.

 జగన్ అంగీకారం

జగన్ అంగీకారం

అయితే నేరుగా పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి అని కాకుండా, జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడిగినట్లుగా వార్తలు వచ్చాయని పేర్కొంది. దీనికి జగన్ అంగీకరించారని తెలిసిందని పేర్కొంది.

 ప్రత్యేక హోదా కామన్ అజెండాతో

ప్రత్యేక హోదా కామన్ అజెండాతో

పవన్ కళ్యాణ్, వైయస్ జగన్ ఇరువురు కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు 2019లో దీనినే ప్రత్యేక ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తున్నాయని కూడా తెలుస్తోందని ప్రచారం సాగుతోంది.

బిజెపి, టిడిపిని ఇరుకున పెట్టొచ్చు

బిజెపి, టిడిపిని ఇరుకున పెట్టొచ్చు

ఇరువురు కలిస్తే, ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకుంటే బిజెపి, టిడిపిలను కచ్చితంగా ఇరుకున పెట్టగలవని చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి కలయిక బాగుంటుందని అంటున్నారు. అయితే, ఇప్పుడు వైసిపి ప్రకటనతో అవన్నీ కేవలం ఊహాగాన వార్తలేనని తేలిందని అంటున్నారు.

 వైసిపి నేతలు కూడా ఖండించారు

వైసిపి నేతలు కూడా ఖండించారు

జనసేనతో వైసిపి కలుస్తుందని, ఆ పార్టీ పలు డిమాండ్లు ముందు పెట్టిందనే ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్‌తో పాటు వైసిపి నేతలు కూడా ఖండించారు.

 జగన్‌కు అలాంటి ఆలోచన లేదు

జగన్‌కు అలాంటి ఆలోచన లేదు

తమ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు జనసేనతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, కేవలం జనసేనతో మాత్రమే కాదని, ఏ ఇతర పార్టీతో పొత్తు ఆలోచన ప్రస్తుతానికి లేదని వైసిపి నేతలు చెబుతున్నారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని చెబుతున్నారు.

English summary
The Prashant Kishor team has dismissed the news being spread in regional broadcast media that the YSRC is planning to have a tie up with the Jana sena. Since morning, a few TV channels have been posting breaking news with visuals, stating that there has been a primary understanding between Pawan Kalyan and Jagan Mohan Reddy about the possible alliance, in 2019. However, the YSRC has dismissed the news as rumours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X