Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..!

విజయవాడ(Vijayawada)లో నాన్-వెజ్ మార్కెట్లు బంద్ కాబోతున్నాయి. చికెన్, మటన్, చేపలు సహా ఏ మాంసాహారం కూడా అమ్మకుండా మున్సిపల్ కార్పోరేషన్ నిషేధాజ్ఢలు విధిస్తోంది. అధికారుల ఆదేశాల్ని ఆయా మార్కెట్లో విక్రయదారులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కేసులు నమోదు చేయడంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిషేధం ఇవాళ రాత్రి నుంచే అమల్లోకి వస్తుంది.

రేపు (మంగళవారం) మహావీర్ జయంతి సందర్భంగా విజయవాడ నగర పరిధిలోని అన్ని నాన్ వెజ్ మార్కెట్లకు అధికారులు సెలవు ప్రకటించారు. కబేళాలతో పాటు చేపల మార్కెట్లు, చికెన్, మటన్ షాపుల్ని కూడా ఇవాళ రాత్రి నుంచి బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు మహావీర్ జయంతి కావడంతో ఇవాళ రాత్రి నుంచే నాన్ వెజ్ అమ్మకాలు నిలిపేస్తున్నారు.

Non-Vegetarian Markets in Vijayawada Ordered to Shut Down Tomorrow for Mahavir Jayanti

కాబట్టి ఎలాంటి జంతువులను వధించడం కానీ, అనుమతి లేకుండా షాపులు తెరచి విక్రయాలకు ప్రయత్నించడం కానీ చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనుమతి లేకుండా ఆయా చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి మటన్, చికెన్, చేపలు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు కూడా షాపులు, మార్కెట్లు మూసేసి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరుతున్నారు. ఎల్లుండి నుంచి తిరిగి మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+