Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదర బెదర: సోషల్ మీడియా పోస్టులపై ముద్రగడ పద్మనాభం.. మరో లేఖ

కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల కాపు, బీసీ, దళిత నేతలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. పల్లకీ మోసింది చాలు.. ఇక మనం ఎక్కాల్సిన సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు. అయితే దీనిని కొందరు తప్పుపడుతున్నారు. పద్మనాభాన్ని దూషిస్తూ మరీ కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఆయన స్పందించారు. తాను ఎవరికీ భయపడనని స్పష్టంచేశారు. ఈ మేరకు మరో లేఖ రాశారు. పోస్టులు చేసిన వారిపై తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

జనాభా తక్కువ ఉన్న జాతులే అధికారాన్ని అనుభవించాలా? అని ఇటీవల ముద్రగడ ప్రశ్నించారు. అధిక జనాభా ఉన్న మన జాతులు అధికార పీఠంపై కూర్చోవాలని పిలుపునిచ్చారు. ముద్రగడకు విమర్శల తాకిడి కూడా తగులుతోంది. లేఖపై కామెంట్లు రాగా.. విమర్శలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. మరో బహిరంగ లేఖను రాశారు. అందులో తనను విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

not fear about social media posts:mudragada padmanabham

ఇటీవల రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించడం పరిపాటి అయిందని అందులో పేర్కొన్నారు. పని చేస్తున్న వారిని దొంగలు, దగాకోరులు అని చెప్పించడం సాధారణ అంశంగా మారిందని అన్నారు. కాపు, బీసీ, దళిత వర్గాలను ఏకం చేయాలని ఆకాంక్షిస్తూ తాను రాసిన లేఖపై విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో తనను బండ బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు.

కానీ తను ఇలాంటి పోస్టులకు తాను భయపడనని, పారిపోనని తేల్చిచెప్పారు. బంతి మాదిరి ఎంత బలంగా కొడితే అంత వేగంగా పైకి లేస్తానని చెప్పారు. వాస్తవం చెబితే కొందరు జీర్ణించుకోవడం లేదని చెప్పారు. బలహీన వర్గాలకు రాజ్య అధికారం వద్దా అని పద్మనాభం మరోసారి ప్రశ్నించారు. కాపు రిజర్వేసన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో దీక్ష చేసి సంచలనం రేకెత్తించారు. బస్సు రోకో, రైల్ రోకో చేపట్టి ప్రభుత్వంలో వణుకు తీసుకొచ్చారు. కానీ రిజర్వేషన్ల ఊసును ప్రభుత్వాలు మరచిపోయాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+