ఉద్యోగులు, టెక్కీల హబ్ టార్గెట్: వరుస ఘటనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యోగులు, సాఫ్టువేర్ ఇంజనీర్లు ఉంటారు. అయితే, ఇప్పుడు ఈ ప్రాంతాల్లోను భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతాల్లో వరుస ఘటనలు జరుగుతున్నాయి.
మాదాపూర్, ఎల్బీనగర్ జోన్ల కింద.. కూకట్‌పల్లి, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవల నేరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆస్తి తగాదాలు, చోరీలు ఎక్కువగా నేరాలు చోటు చేసుకుంటున్నాయి.

గత రెండు నెలలుగా జరిగిన నేరాల ఫిగర్స్ తీసుకుంటే కేపీహెచ్‌బీ పరిధిలో 85 కేసులు నమోదయ్యాయి. అందులో 61 కేసులు దొంగతనాలు, చైన్ స్నాచింగులు, ఆటోమొబైల్స్ దొంగతనాలు తదితరాలు ఉన్నాయి. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధఇలో 61 కేసులు నమోదు కాగా అందులో 55 పైతరహా కేసులు ఉన్నాయి.
పై తరహా కేసులు వనస్థలిపురం పోలీసు స్టేషన్‌లో 56, చైతన్యపురి పీఎస్‌లో 52, హయత్ నగర్ పీఎస్‌లో 52 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రాబరీ, ఆటోమొబైల్స్ దొంగతనాలు, ఇళ్లలో దోచుకోవడం, చైన్ స్నాచింగ్స్ ఎక్కువగా ఉన్నాయి.
కూకట్‌పల్లి ప్రాంతంలో సాఫ్టువేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు. వారు ఇళ్లకు తాళాలు వేసుకొని కార్యాలయాలకు వెళ్తారు. ఇక ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురంలు ఔట్ స్కర్ట్స్‌లో ఉన్నాయి. ఇక్కడ ఏదైనా జరిగితే వెంటనే తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని దొంగలు భావిస్తున్నట్లుగా ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications