రాజమండ్రిలో ఎన్నారై కిడ్నాప్, ఎవరు.. ఎందుకు? కూల్‌డ్రింక్‌లో పురుగు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం సాయంత్రం కలకలం చెలరేగింది. నలుగురు యువకులు ద్విచక్ర వాహనం పైన వచ్చి ఓ ఎన్నారైని ఎత్తుకెళ్లారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్‌కు గురైన వ్యక్తి విశాఖపట్నం జిల్లాకు చెందిన చక్రవర్తిగా గుర్తించారని తెలుస్తోంది. అతను ఓ ఎన్నారై అని సమాచారం. అతను రాజమండ్రిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని గుడి వద్దకు కారులో వచ్చారు. ఈ సమయంలో నలుగురు యువకులు అతనిని అడ్డుకున్నారు.
అతనిని కారులో నుంచి దించేశారు. అతని పైన చేయి చేసుకున్నారు. అనంతరం ఆయన కారులోనే అతనిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లారు. మరో ఇద్దరు వచ్చిన బైకుల పైన అదే కారును వెంబడించారు. కిడ్నాప్ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీనిని ఫోటోలు తీశాడు.

కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఎన్నారై నాలుగు రోజులుగా ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుస్తోంది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగింది.
తిరుమలలో కూల్ డ్రింక్
తిరుమలలో పెప్సీ కూల్ డ్రింక్‌లో పురుగు వచ్చింది. ఓ వ్యక్తి దుకాణంలో పెప్సీ డ్రింక్ కొన్నాడు. అయితే, దానిని తెరిచి తాగుతుండగా పురుగు కనిపించింది. దీంతో దుకాణం యజమానిని అడిగాడు. తనకు తెలియదని, కంపెనీకే తప్పని చెప్పాడు.












Click it and Unblock the Notifications