'ఇదం కౌటిల్యం'లో బాబు, దత్తాత్రేయ ముచ్చట: చెక్కులు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ, జాతి మాత్రం ఒక్కటేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నారు. నరసింహమూర్తి రచించిన ఇదమ్ కౌటిల్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జలవిహార్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగింది.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకులకు పాలన, ఆర్థిక రంగాలపై అవగాహన ఉండాలని కౌటిల్యుడు చెప్పారన్నారు.

ఇదమ్ కౌటిల్యం ఆవిష్కరణ
నరసింహమూర్తి రచించిన ఇదమ్ కౌటిల్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జలవిహార్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇదమ్ కౌటిల్యం ఆవిష్కరణలో బాబు, దత్తాత్రేయ
పుస్తక రచయిత నరసింహమూర్తి వివిధ శాఖల పాలనలో తనకు సాయంగా ఉన్నారని చెప్పారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. నాయకులకు, పాలకులకు పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత అవసరమని కౌటీల్యుడు చెప్పారన్నారు.

ఇదమ్ కౌటిల్యం
సభలో రచయిత నరసింహమూర్తి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అరవింద రావు, ఐ ఫోకస్ వాసుదేవశర్మ, ఎమ్మెస్కో చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.

చంద్రబాబు
ఇక్రిశాట్ డీజీ డాక్టర్ డేవిడ్ బెర్గ్‌విజన్ శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిశారు.

చంద్రబాబు
సీడ్‌మెన్ అసోసియేషన్ సభ్యులు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిసి, రూ.10 లక్షల చెక్కును అందచేశారు.

చంద్రబాబు
టాంజానియా తెలుగు అసోసియేషన్ సభ్యులు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిసి, రూ.3 లక్షల చెక్కును అందజేశారు.

చంద్రబాబు
స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ పోర్టల్‌ను శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ప్రారంభించారు.

చంద్రబాబు
స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ పోర్టల్‌ను శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ప్రారంభించారు.

చంద్రబాబు
ఎన్నారై టీడీపీ ప్రచార సభ్యులు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లేక్ వ్యూ అతిథి గృహంలో కలిసి, 10వేల డాలర్లు అందజేశారు.












Click it and Unblock the Notifications