ఎన్టీఆర్ కార్యక్రమానికి దూరంగా తారక్ - అసలు కారణం అదేనా..!!

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారక నాణాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం హాజరైంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవటం కొత్త చర్చకు కారణం అవుతోంది.

నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం 100 రూపాయల స్మారక నాణాన్ని ఆవిష్కరించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణాన్ని విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిజెపి జాతి అధ్యక్షుడు నడ్డాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. టిడిపి అధినేత చంద్రబాబుతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సన్నిహితులు, దాదాపు 200 మంది అతిథులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రపతి భవన్ కు చంద్రబాబు పురందేశ్వరి తో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. కానీ, ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావించిన జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. దీని వెనుక పలు కారణాలు చర్చకు వస్తున్నాయి.

NTR Coin launch at delhi: Jr NTR to skip the event , here is the reason

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు కానీ, ఆయన హాజరు కాలేదు. కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. అంతకుముందు విజయవాడలో నిర్వహించిన ఇదే తరహా కార్యక్రమంలో తారక్ ను ఆహ్వానించకపోవడంపై అభిమానులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో దేవర షూటింగ్ కారణంగానే హాజరు కాలేదని చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం ప్రచారం చేశారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తారక్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర చంద్రబాబు సభల్లోను తారక్ అభిమానులు ప్లెక్సీలు, జెండాలు ప్రదర్శిస్తున్నారు ఫ్యూచర్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తారక్ హాజరు కాకపోవటం వెనుక సినిమా షూటింగ్ మాత్రమే కారణమా, లేక కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే అసలు కారణమా అనే చర్చ ఇప్పుడు సినీ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+