ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదా.. అల్లు అర్జున్‌కు చేదు అనుభవమేనా...?

ఏపీ సీఎంగా చంద్రబాబు మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాజకీయాల్లో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్ మొదలగు వారు హాజరైయ్యారు. ఇక పవన్ కల్యాణ్ మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. రామ్ చరణ్ సైతం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హరికృష్ణ కుమారులైన ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్‌లు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వీరికి ఆహ్వానం అందిందని ప్రచారం జరగ్గా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌కు ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన సందర్భంలో ఎన్టీఆర్ నుంచి కనీస స్పందన కూడా లభించలేదు. దీంతో టీడీపీ అభిమానులు ఎన్టీఆర్‌పై అప్పట్లోనే తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగానే ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్‌లను ఈ కార్యక్రమానికి దూరం పెట్టినట్టు తెలుస్తోంది.

NTR didn t get invited Bitter experience for Allu Arjun

ఇక మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్‌కు సైతం ఆహ్వానం అందలేదట. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా..అక్కడి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీని కారణంగానే అల్లు అర్జున్‌కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని సమాచారం. మొత్తానికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన వీరిద్దరికి ఏకకాలంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం షాకిచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+