వైసీపీకి మద్దతుగా ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ
నామినేషన్లకు గురువారం చివరి రోజు కావడంతో నేతలందరూ కూడా ఆర్వో కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.వైసీపీ ,జనసేన, టీడీపీ వంటి ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు గురువారం నిమినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత , సీఎం జగన్ సైతం గురువారమే పులివెందులలో తన నామినేషన్‌ను దాఖలు చేయడం జరిగింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కొడాలి నాని నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ అభిమానులు భారీగా హాజరైయ్యారు.
గుడివాడ నగరం అంతా వైసీపీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. గుడివాడ మొత్తం వైసీపీ జెండాలతో నిండిపోయింది. ఇదిలా ఉంటే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. కొడాలి నాని ఫ్లకార్డుల్లో ఎన్టీఆర్ ఫొటోలు దర్శనమిచ్చాయి. కొడాలి నానికి మద్దతుగా ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలతో కూడిన జెండాలతో కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో గుడివాడలో ఎన్టీఆర్ ఫోటో, ఫ్లెక్సీల రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌కు కొడాలి నాని అత్యంత ఆప్తుడనే విషయం అందరికీ తెలిసిందే. కొడాలి నానికి మొదట టీడీపీ టికెట్ దక్కడానికి ఎన్టీఆరే కారణం. ఆ తరువాత రాజకీయ పరిణామాలతో కొడాలి నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.అటు ఎన్టీఆర్ సైతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
టీడీపీ తరుఫున రెండుసార్లు గెలిచిన కొడాలి నాని..వైసీపీ తరుఫున మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. టీడీపీకి కొడాలి నాని కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానిని ఓడించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే గుడివాడ టీడీపీ తరుఫున వెనిగళ్ల రామును రంగంలోకి దించింది. ఎవరొచ్చిన గుడివాడలో తానే మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications