ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన ఎన్టీఆర్...?
జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయాలపై మంచి పట్టున్న సంగతి అందరికి తెలిసింది. 2009 ఎన్నికల సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రచారం కూడా నిర్వహించారాయన. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం.. ఆ తరువాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టిని సారించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఏ మాత్రం చెక్కు చెదరలేదు.

తమిళనాడు ఎన్నికల సమయంలో అక్కడ డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్టీఆర్ ముందే ఊహించారని..ఈ విషయాన్ని తనతో చెప్పారని దర్శకుడు, నటుడు సముద్రఖని ఓ ఇంటర్య్వూలో తెలిపారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ తన సన్నిహితులతో చెప్పారట. ఎన్టీఆర్ చెప్పినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ ఘన పార్టీ విజయం సాధించడంతో ఆయన సన్నిహితులు షాక్ అవుతున్నారట.

ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై కూడా ఎన్టీఆర్ స్పందించినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేజిక్కించుకుంటుందని పలు సందర్భాల్లో ఎన్టీఆర్ అన్నారట. ఎన్టీఆర్ ఇప్పటి వరకూ చెప్పినవి అన్నీ జరగడంతో.. ఏపీలో కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో వచ్చే ఏడాది ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎన్టీఆర్ చెప్పారని వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications