ప్రయాణికులకు హెచ్చరిక: ఏపీలో రైళ్లన్నీ రద్దు
ఒడిసాలోని బాలసోర్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 300కు పైగా ప్రయాణికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అటువంటి దుర్ఘటనలు తిరిగి జరగకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. అందులో భాగంగా అన్ని డివిజన్లలో పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు ఆటంకాలేర్పడతాయనే ఉద్దేశంతో కొన్నిరైళ్లను రద్దుచేయడం, మరికొన్నింటిని దారిమళ్లించి తిప్పడంలాంటివి చేస్తున్నారు. తాజాగా ఈనెల 29వ తేదీ నుంచి వచ్చేనెల ఒకటోతేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు.
ఈనెల 29న తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్
ఈనెల 30న విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ రద్దు చేశారు.

29, 30, 1 తేదీల్లో
విశాఖపట్నం-గుంటూరు-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ ప్రెస్
విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ రత్నాచల్ సూపర్ ఫాస్ట్
గుంటూరు-విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి
విజయవాడ-రాజమండ్రి మెమూ
రాజమండ్రి-విశాఖపట్నం-రాజమండ్రి మెమూ రైళ్లను రద్దు చేశారు.
దారి మళ్లించిన రైళ్లు
విశాఖపట్నం-దువ్వాడ-విజయవాడ-వరంగల్-బల్లార్షకు బదులుగా విజయనగరం-రాయగడ-టిట్లాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్ మీదుగా ఎనిమిది రైళ్లను దారిమళ్లించి తిప్పుతున్నారు. మరికొన్ని రైళ్లను వరంగల్, సికింద్రాబాద్ కు బదులుగా గుంటూరు, పగిడిపల్లి మీదుగా ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు. వీటి వివరాలన్నీ రైల్వే వెబ్ సైట్ లో ఉన్నాయని, పూర్తిగా సరిచూసుకొని అందుకు తగిన విధంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications