Odisha Train Accident: తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు, 9వ తేదీ వరకు..!!

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేసారు. మూడు రైళ్లు ఢీ కొనటంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. దేశంలో జరిగిన అతి పెద్ద అయిదు రైలు ప్రమాదాల్లో ఒది ఒకటిగా నిలిచింది. గత పదేళ్ల కాలంలో జరిగిన ఘోర ప్రమాదం కూడా ఇదే. సహాయక చర్యలు వేగవంతం చేసారు. ఇదే సమయంలో ఈ లైన్ మరమ్మత్తులకు ఈ నెల 9వ తేదీ వరకు సమయం పడుతుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో విజయవాడ డివిజన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

పలు రైళ్లు రద్దు : ఒడిశా రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-రాజమండ్రి(07459), రాజమండ్రి-విజయవాడ(07460), రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం- రాజమండ్రి(07467), కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం(17267).

 odishatrainaccident

విశాఖపట్నం- కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్ -విజయవాడ(17258), విజయవాడ -కాకినాడ పోర్ట్(17257), గుంటూరు -విశాఖపట్నం(17239), విశాఖపట్నం -గుంటూరు(17240), విశాఖపట్నం- విజయవాడ(22701), విజయవాడ- విశాఖపట్నం(22702) ట్రైన్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రద్దు చేశారు.

అనేక రైళ్లు దారి మళ్లింపు : అదే విధంగా ఈశాన్యం నుంచి దక్షిణాదికి వచ్చే పలు రైళ్లను రద్దు చేయగా..మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈ రోజు దాదాపు 50 రైళ్లను రద్దు చేయగా.. 38 రైళ్లను దారి మళ్లించారు. హోరా-తిరుపతి(20889), హోరా-సికింద్రాబాద్(12703), హోరా-హైదరాబాద్(18045) రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-షాలిమార్(22850), వాస్కోడగామా-షాలిమార్(18048) రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించనుండగా..

చెన్నై సెంట్రల్-హౌరా(12840) ట్రైన్‌ను జరోలి మీదుగా, బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా మళ్లించనున్నారు. హౌరా-పూరీ(12837), హౌరా-బెంగళూరు(12863), హౌరా-చెన్నై మెయిల్(12839), హౌరా-సంబల్‌పూర్(20831), సంత్రగాచి-పూరీ(02837), కన్యాకుమారి-హోరా(1266), చెన్నై సెంట్రల్-హౌరా(12842), బెంగళూరు- రైళ్లను నేడు రద్దు చేశారు.

 odishatrainaccident

ఆ రెండు రైళ్లల్లో ఏపీ ప్రయాణీకులు : కోరమండల్ ఎక్స్ ప్రెస్‍లో తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు రిజర్వేషన్ సమాచారం ఆధారంగా తెలుస్తోంది. కోరమండల్‍లో విజయవాడ బయల్దేరిన ప్రయాణికుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. విజయవాడలో 47, రాజమండ్రిలో 22, ఏలూరులో ఒకరు కలిపి మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్‍లోనూ తెలుగు ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. 52 మందికి పైగా తెలుగు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్లల్లో యశ్వంతపూర్ రైలులో ప్రయాణికులు ఎక్కినట్టు చెబుతున్నారు. ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వం..ఇప్పటికే ఘటనా స్థలికి మంత్రి అమర్నాధ్ తో పాటుగా అధికారులను పంపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+