Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మచిలీపట్నం ప్రజలకు గుడ్ న్యూస్

కృష్ణా జిల్లా దివిసీన ప్రజల దశాబ్దాల చిరకాల కోరిక, కల అయిన మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడిందని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మంగళవారం మచిలీపట్నంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ బాలశౌరి పాల్గొని, మాట్లాడారు. మచిలీపట్నం రైల్వే లైన్‌ అంశం గత ఎన్నికల్లో తాను హామీ ఇచ్చానని, దాన్ని నెరవేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసి నేడు తొలి అడుగుపడిందని ఎంపీ పేర్కొన్నారు. రైల్వే లైన్‌ కోసం త్వరలో సర్వే, డీపీఆర్‌ అధికారులు తయారు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ..
''మచిలీపట్నం పోర్టు కోసం ఉద్యమాలు జరిగినట్లే, మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి నేను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలోనే బందర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.అలాగే ఇటీవలి ఎన్నికల ముందు నా మ్యానిఫెస్టోలో నేను మొట్టమొదటిగా చెప్పిన ప్రాజెక్టు, అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌ నిర్మాణం కోసం. దీన్ని ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని ఉద్దేశంతో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గారిని పలుమార్లు కలవడం ఈ ప్రాజెక్టు గురించి చెప్పి ఒప్పించడం జరిగింది.

officials are positive on Machilipatnam-Repalle railway line issue

మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు రైల్వే లైన్‌ నిర్మించాలని తొలుత ఆలోచన చేయడం జరిగింది. కానీ రేపల్లె నుంచి తెనాలికి రైళ్లు వెళ్లాలి అంటే వెనక్కి వెళ్లినట్లు అవుతుంది. అందుకని మచిలీపట్నం నుంచి చల్లపల్లి, భట్టిప్రోలు, నిడుబ్రోలు, బాపట్ల వరకు ఈ రైల్వే లైన్‌ పొడిగించాలని రైల్వే మంత్రిని కోరడం జరిగింది. దీని వల్ల దూరం తగ్గడంతోపాటు, సమయం కూడా కలిసి వస్తుందని, ఖర్చు ఆదా అవుతుందని రైల్వే అధికారులకు తెలియజేయడంతో వారు కూడా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. ఇప్పటికే నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్‌ నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు మరో నూతన రైల్వే లైన్‌ వస్తే.. ఇదంతా కలిపి కోస్టల్‌ రైల్వే లైన్‌ అవుతుంది అంటే సముద్ర తీరంలో రైల్వే లైన్‌ ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఈ లైన్‌ ప్రయాణికుల కోసం మాత్రమే కాకుండా సరకు రవాణాకు కూడా ఎంతగానో ఉపయోగపడుంది.

మీ అందరికీ తెలుసు.. హౌరా టు చెన్నై రైల్వే లైను చాలా ఫేమస్ ట్రంక్‌ లైన్‌ . ఈ లైన్‌కు అనుసంధానం చేస్తూ.. మచిలీపట్నం నుంచి బాపట్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో విజయవాడ స్టేషన్‌ ఒకటి. అనేక గూడ్స్‌ రైళ్లు, ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆ మార్గం నుంచి వెళ్లడంతో ఇంకా రద్దీగా మారుతోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు నూతన రైల్వేమార్గం కనుక ఏర్పాటైతే విజయవాడ జంక్షన్‌ మీద ట్రాఫిక్‌ భారం తగ్గుతుంది. మచిలీపట్నం నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు వెళ్లే ప్రయాణికులకు 70-80 కిలోమీటర్లు దూరం తగ్గడంతోపాటు, చాలా సమయం కూడా ఆదా అవుతుంది.

ఈ రైలు మార్గం ఏర్పాటులో ఎంతగానో సహకరిస్తున్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా రైల్వే లైన్‌ ఏర్పాటు చేయాలంటే ముందుగా సర్వే చేయాలి, డీపీఆర్‌ రూపొందించాలి. మచిలీపట్నం - బాపట్ల రైల్వే లైన్‌కి సంబంధించి ఈ రెండు పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. త్వరలో ఈ పనులు ప్రారంభమై.. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మీ పార్లమెంట్‌ సభ్యుడి నా వంతు తప్పకుండా కృషి చేస్తానని కృష్ణా జిల్లా ప్రజానీకానికి మరోమారు విన్న వించుకుంటున్నాను.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+