రేపు ఏపీలో పదో తరగతి పరీక్ష ఉందా..? లేదా..?..ఆ సెలవుతో అంతా గందరగోళం
ఏపీలో రేపు(మంగళవారం) జరగాల్సిన పదో తరగతి పరీక్షపై కొంత సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలుత పదో తరగతి పరీక్షలు ఈ నెల 17న మొదలై, 31 ముగిస్తాయని ప్రకటించారు అయితే సోమవారం జరగాల్సిన పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినంగా ప్రకటించింది.దీంతో పదో తరగతి సోషల్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించాలని విద్యాధికారులు నిర్ణయించారు.
అయితే మంగళవారం జరగాల్సిన పరీక్ష జరుగుతుందా లేదా అంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం ..చంద్రబాబు సర్కార్ మంగళవారం ఆప్షనల్ హాలిడే ఇవ్వడమే. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఆప్షనల్ హాలిడే ప్రకటించడంతో , మంగళవారం జరగాల్సిన పరీక్ష ఉందా లేదా అంటూ విద్యార్ధులు అయోమయంలో ఉండిపోయారు.

అయితే తాజాగా విద్యాశాఖ అధికారులు దీనిపై స్పందించారు.ఆప్షనల్ హాలిడేకు పదో తరగతి పరీక్షలకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. ఆప్షనల్ హాలిడే ఇచ్చినంత మాత్రాన పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.ఈ క్రమంలో మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు సోషల్ పరీక్ష ఉంటుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్ష కోసం బాగా చదవాలని సూచించారు.












Click it and Unblock the Notifications