అధికారులకు చుక్కలు చూపిస్తున్న పడవలు, నదిలో నరాలు కట్ అయ్యే టెన్షన్

ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్లను తొలగించే ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గత నాలుగు రోజులుగా పగలు, రాత్రి అని తేడా లేకుండా గంటల తరబడి ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న బోట్లను తొలగించడానికి అధికారులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు, కార్మికులను ఆ బోట్లు నానా తిప్పలు పెడుతున్నాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బోట్లు మాత్రం బయటకు రావడం లేదు. భారీ క్రైన్లు తీసుకొచ్చి బోట్లను బయటకు లాగేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. విశాఖ నుంచి వచ్చిన డైవింగ్ టీం నది లోపలికి వెళ్లి నీటిలోనే ఆ బోట్లను ముక్కలు చేసి బయటకు తీయడానికి అనేక విధాలుగా శ్రమించారు. అయినా కూడా బోట్లు మాత్రం ప్రకాశం బ్యారేజ్ నుంచి బయటకు తీయడానికి సాధ్యం కావడం లేదు.

Officials stopped the process of taking out the boats stuck in Prakasam Barrage

బోట్లను బయటకు తియ్యడానికి కాకినాడకు చెందిన టీమ్ ను రంగంలోకి దింపుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ లో చిక్కుకున్న బోట్లను బయటకు తరలించేందుకు ప్రత్యేక టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఒక్కో బోటు సుమారు 50 టన్నులకు పైగా బరువు ఉండటంతో వాటిని బయటకు తీయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ లో చెక్కుకున్న బోట్లను భారీ గొలుసు కట్టి బయటకు లాగడానికి ప్రయత్నించారు.

అయితే కేవలం పది అడుగుల ముందుకు వెళ్లిన బోట్లు బోల్తా పడి ఇసుకలో చిక్కుకున్నాయని అధికారులు అంటున్నారు. క్రైన్ లిస్ట్ తో బోట్లు పైకి లేపడానికి అనేక ప్రయత్నాలు చేసిన అధికారులు చివరికి విఫలం అయ్యారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ లో చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం మరో రకంగా ఆ బోట్లను బయటకు తియ్యడానికి అధికారులు ప్లాన్ చేశారు.

ఇటీవల భారీ వర్షాలు కురిసిన సమయంలో ఐదు బోట్లను ప్రకాశం బ్యారేజీ లో కొట్టుకొని వచ్చేశాయి. వైసీపీ మద్దతుదారులు కావాలనే భారీ బోట్లకు నైలాన్ తాళ్ళు కట్టి అవి ప్రకాశం బ్యారేజీ కొట్టుకొని వెళ్లలా కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రామ్మోహన్, ఉషాద్రి అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+