రఘురామ కృష్ణంరాజు పాత వీడియో వైరల్- ఖండించిన ఆర్ఆర్ఆర్
అమరావతి: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ సోషల్ మీడియా దీన్ని వైరల్ చేసింది. ఓ తెలుగు న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సంబంధించిన వీడియో అది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పడే ఓట్ల శాతం పెరుగుతుందని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఈ వీడియోలో చెప్పారు.
అది ఈ ఏడాది జులై 3వ తేదీతో వైరల్ అయింది. తెలుగు వన్ ఇండియాలో పబ్లిష్ అయింది. దీనిపై రఘురామ కృష్ణంరాజు తాజాగా స్పందించారు. ఈ వీడియో వైరల్ కావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ఖండించారు. నాలుగు సంవత్సరాల కిందటి పాత వీడియో అని స్పష్టం చేశారు. వైసీపీ సోషల్ మీడియా.. దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తోందంటూ మండిపడ్డారు.

మూడున్నర సంవత్సరాల కిందట తాను జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా వైయస్సార్సీపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని తేల్చి చెప్పారు. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు విశ్రమించేది లేదంటూ రఘురామ స్పష్టం చేశారు.
వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నేను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు.. అని పేర్కొన్నారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈ పార్టీ అంటూ విమర్శించారు.












Click it and Unblock the Notifications