వెయేళ్ల రాజధాని ప్లాన్-నాశనం చేసిన జగన్-అమరావతి శంఖుస్ధాపనకు ఏడేళ్లు-చంద్రబాబు ట్వీట్స్

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంఖుస్ధాపన చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2015లో ఇదే రోజు అమరావతిని రాజధానిగా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో కలిసి శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇవాళ వరుస ట్వీట్లు చేశారు. వీటిలో చంద్రబాబు అమరావతి రాజధాని ఎలా ప్రారంభమై, ఎలా ఆగిపోయిందో గుర్తుచేశారు.

ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యిందని చంద్రబాబు పేర్కొన్నారు.

అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పమని చంద్రబాబు మరో ట్వీట్ లో తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని, ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి... అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడన్నారు.

on amaravati foundation day, chandrababu tweets amaravati will win.. thats final

అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవని చంద్రబాబు మూడో ట్వీట్ లో తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని, అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని, నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందన్నారు. అమరావతే గెలుస్తుంది... ఇదే ఫైనల్ అన్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+