చెక్కుచెదరని జగన్ క్రేజ్...జన సంద్రమైన వినుకొండ
వైసీపీ అధినేత, ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు ఎంతటి ఆదరణ ఉందో మరోసారి బయటపడింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ హత్య కావడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ శుక్రవారం వినుకొండ వెళ్లారు. మార్గమధ్యలో అభిమానులు జగన్ కాన్వాయ్‌ను ఆపి మరి ఆయన తమ అభిమానాన్ని చూపించారు. విజయవాడ నుంచి వినుకొండకు వెళ్ళాలంటే సాధారణంగా పట్టే సమయం రెండు లేదా రెండున్నర గంటలు.
కానీ జగన్‌కు అందుకు దాదాపు రెట్టింపు సమయం పట్టింది. విజయవాడలో జోరు వానలో మొదలైన జగన్ పర్యటన.. అదే వానలో.. అశేష జనవాహిని, అభిమానుల తాకిడి మధ్య కొనసాగింది.మాజీ సీఎంకు కొత్తగా కేటాయించిన బులెట్ ప్రూఫ్ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో, మంగళగిరి వద్ద హైవేపై.. ఆయన పార్టీ నాయకుడికి చెందిన మరో వాహనంలోకి మారారు.

ఆ తర్వాత రూట్‌లో ప్రతి చోట పెద్ద ఎత్తున అభిమానులు సంఘీభావం ప్రకటిస్తూ తరలి రావడంతో, ఆయన వాహనాన్ని ఆపుతూ, అందరికీ అభివాదం చేస్తూ మందుకు కదిలారు. ఇక గుంటూరు, చిలకలూరిపేట, నర్సారావుపేట బైపాస్ రోడ్ల వద్ద అభిమానులు పోటెత్తడంతో, ఆయన ప్రయాణానికి బ్రేక్ పడింది. వర్షం కురుస్తున్నా అభిమానులు ఎక్కడా తగ్గలేదు. మరోవైపు జగన్ పర్యటనకు పోలీసులు పదే పదే ఆటంకం కల్పించారు.
దాదాపు 15 చోట్ల, ఆయన కాన్వాయ్‌లోని వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అతి పరిమిత సంఖ్యలో మాత్రమే వారు మాజీ సీఎం వెంట వాహనాలను అనుమతించారు. దీంతో పోలీసుల తీరుపై వైసీపీ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్ రాకతో వినుకొండ జన సంద్రమైంది. గత బుధవారం రాత్రి, పట్టణంలో దారుణహత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ వినుకొండ వెళ్లారు. రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారిని ఓదార్చారు. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications