పల్నాడులో మరో ఘోరం: బయటికొచ్చిన వీడియో: ఉలిక్కిపడ్డ టీటీడీ: ఇప్పటిది కాదంటూ
Narasaraopet: పల్నాడు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మొన్నటికి మొన్న జిల్లాలోని వినుకొండలో నడిరోడ్డుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రషీద్‌ను తెలుగుదేశానికి చెందిన కార్యకర్త షేక్ జిలానీ అత్యంత ఘోరంగా నరికి చంపాడు. దీనిపై చెలరేగిన దుమారం ఇంకా తగ్గట్లేదు.
అదే సమయంలో అదే జిల్లాలో మరో దిగ్భ్రాంతికర ఘటన సంభవించింది. జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు కొందరు సీనియర్ విద్యార్థులు. తమ హాస్టల్ గదులకు పిలిపించి.. కర్రలో చావబాదారు. దీనికి ఎన్‌సీసీ ట్రైనింగ్ అని పేరు పెట్టారు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నరసరావుపేటలోని శ్రీ సుబ్బారాయ, నారాయణ కళాశాలలో హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలి సంవత్సరం విద్యార్థులను తమ హాస్టల్ గదులకు పిలిపించుకున్న కొందరు సీనియర్లు భౌతికంగా దాడి చేయడం, వారిని ఇష్టానుసారంగా కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
జూనియర్లను కొడుతూ నవ్వుకోవడం, దుర్భాషలాడడం, ఇంకా గట్టిగా కొట్టాలంటూ చెప్పుకోవడం ఇందులో వినిపించింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. ఆరుమంది విద్యార్థులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణా రెడ్డి తెలిపారు. ఈ సంఘటన ఫిబ్రవరిలో జరిగిందని వివరించారు.
ఈ ఘటనపై బాధిత విద్యార్థులు గానీ, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేయలేదని సీఐ పేర్కొన్నారు. వీడియో ఇప్పుడు వెలుగులోకి రావడంతో బాధిత విద్యార్థుల నుంచి ఫిర్యాదు అందాయని తెలిపారు. ర్యాగింగ్ నిషేధ చట్టం 2011లోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
ఈ ఘటనలో ఒక విద్యార్థిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తోన్నామని అన్నారు. చట్టపరంగా ర్యాగింగ్ నేరమని, దీనిపై కఠిన శిక్షలు ఉన్నాయని సీఐ చెప్పారు. ర్యాగింగ్ జరిగితే- విద్యార్థులు ఆలస్యం చేయకుండా యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఇది ఫిబ్రవరిలో జరిగిందని, తమ పాలనలో కాదని వివరణ ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ లేనివిధంగా ర్యాగింగ్ విజృంభించిందని ఆరోపించింది. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని టీడీపీ ఎద్దేవా చేసింది.












Click it and Unblock the Notifications