శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ అత్యంత లగ్జరీ టీవీని భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. 110 అంగుళాల 4కే డిస్ ప్లేతో తీసుకువచ్చారు. ఎం1ఏఐ ప్రాసెసర్ ను ఉపయోగించారు. స్క్రీన్ తయారు చేయడానికి సఫైర్ గ్లాస్ ఉపయోగించారు. మొబైల్ మిర్రరింగ్, వైఫై కనెక్టివిటీ, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ టీవీ ధరను రూ.1,14,99,000గా శాంసంగ్ నిర్ణయించింది. అంటే దీని ధర కోటిరూపాయల పైనే ఉంది. 110 అంగుళాల మైక్రో ఎల్ ఈడీ డిస్ ప్లే, సఫైర్ గ్లాస్ తో తయారుచేసిన24.8 మిలియన్ మైక్రో ఎల్ ఈడీలు అమర్చారు. దీనివల్ల కంటికి హాని కలిగించే శక్తివంతమైన రంగులు కూడా కంటికి ఇంపుగా కనపడతాయని శాంసంగ్ ప్రకటించింది. మైక్రో హెచ్ డీఆర్, మల్టీ ఇంటెలిజెన్స్ ఏఐ అప్ స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్ పాన్షన్ ప్లస్ వంటి ఫీచర్లను అందిస్తోంది.

ఈ కోటిరూపాయల ఎల్ ఈడీ టీవీ మల్టీ వ్యూ ఫీచర్ ను అందిజేస్తోంది. నాలుగు వేర్వేరు సోర్సుల నుంచి కూడా కంటెంట్ ను చూడవచ్చు. మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్ తో టీవీని తయారు చేశారు. ప్రత్యేకంగా అమర్చిన ఆర్ట్ యాడ్, యాంబియంట్ మోడ్ ప్లస్ సాయంతో దీన్ని ఆర్ట్ డిస్ ప్లే వాల్ గా మార్చుకోవచ్చు. నాణ్యమైన ఆడియో కోసం 100 w RMS సౌండ్ సిస్టం ఉంది. సోలార్ సెల్ రిమోట్ ఇచ్చారు. ఇండోర్ లైట్ సహాయంతో దీన్ని ఛార్జి చేయవచ్చని కంపెనీ తెలిపింది. శాంసంగ్ వెబ్ సైట్లతోపాటు ఇతర రిటైల్ స్టోర్లలోను దీన్ని కొనుగోలు చేయవచ్చు.












Click it and Unblock the Notifications