ఆగిపోయిన సీఎం జగన్ బస్సు యాత్ర
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు."మేమంతా సిద్ధం" పేరిట జగన్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. మార్చి 27వ తారీకు ఇడుపులపాయలో మొదలుపెట్టిన ఈ యాత్ర ఇచ్చాపురం వరకు సాగనుంది. కడపలో మొదలైన బస్సుయాత్ర, కర్నూల్ జిల్లాలో సాగుతూ.. అనంతపురంలో ఎంట్రీకి ఇచ్చింది. జగన్ చేస్తోన్న ఈ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మేమంతా సిద్ధం సభలతో జగన్ విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ఈ రోడ్ షోలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

మార్గం మధ్యలో అక్కడక్కడా బస్సును నిలుపుతూ అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. తమ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే "మేమంతా సిద్ధం" బస్సు యాత్రకు ఒక రోజు విరామం ప్రకటించారు.ఆదివారం ఈస్టర్ కారణంగా.బస్సు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇస్తున్నట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈస్టర్ వేడుకలలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు.
శనివారం ఎక్కడైతే బస్సు యాత్ర ఆగిందో అక్కడ నుంచే సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఈ యాత్ర సాగుతోంది. 2024 ఎన్నికలను సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకుండా ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతున్నారు.ఇంకా ఎన్నికలకు 40 రోజులు మాత్రమే సమయం ఉండటంతో పూర్తిగా ప్రజా క్షేత్రంలో ఉండే విధంగా వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది.












Click it and Unblock the Notifications