బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టు మృతదేహం లభ్యం
విశాఖపట్టణం: ఎఓబిలో ఎన్ కౌంటర్ జరిగి వారం రోజులు దాటినా..ఈ ఘటనలో మరణించిన మావోయిస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.తాజాగా బలిమెల రిజర్వాయర్ లో ఓ మృతదేహాం లభ్యమైంది. ఈ మృతేహాంతో చనిపోయిన మావోల సంఖ్య 31 కి చేరింది.
బలిమెలి రిజర్వాయర్ వద్ద చనిపోయిన మావోయిస్టు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.ఈ మృతదేహం బిబాసు నాయక్ గా గుర్తించారు.ఈ మృతదేహానికి సమీపంలోనే మరో రెండు మృతదేహాలు కూడ ఉన్నాయని స్థానికులు తెలిపారు.వీటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు .

ఎన్ కౌంటర్ లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు పారిపోయే క్రమంలో బుల్లెట్ల గాయాలతో బలిమెల రిజర్వాయర్ లో పడి చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. రిజర్వాయర్ లో ఇంకా ఎవరైనా పడి చనిపోయి ఉంటారా అనే అనుమానాలు కూడ వ్యక్తంఅవుతున్నాయి.పోలీసు ఉన్నతాదికారులు కూడ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.
ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుండి మావోయిస్టు అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల రవి , చలపతిల సమాచారం మాత్రం రాలేదు.ఈ విషయమై రామకృష్ణ సతీమణి శిరీష హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై రామకృష్ణకు సంబందించిన సమాచారాన్ని హైకోర్టుకు తెలపాని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications