హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే ఒక్క నిర్ణ‌యం... పూర్తి సంక్షోభంలోకి జారుకున్న తెలుగు సినీ పరిశ్రమ

|
Google Oneindia TeluguNews

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతోంది. అగ్ర ద‌ర్శ‌కులు, అగ్ర నిర్మాత‌లు, అగ్ర క‌థానాయ‌కులు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణ‌యమే దీనికి కార‌ణం. సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందో తెలుసుకొని దాన్ని పరిష్కరించకపోవడమే తాజా సంక్షోభానికి కారణమవుతోంది. రెండు మూడు సినిమాల‌ను మిన‌హాయిస్తే క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత విడుద‌ల‌వుతున్న ప్ర‌తి సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ఎంత బాగా సినిమా తీసిన‌ప్ప‌టికీ ఎందుకు రావడంలేదంటే.. దానికి కారణం.. థియేటర్లలో అమలవుతున్న టికెట్ ధరలు. అవే ధరలు ఇప్పుడు సినీ పరిశ్రమనే పూర్తిగా ముంచేశాయని చెప్పవచ్చు.

 మబ్బులు వీడిపోయాయి.. భవిష్యత్తు ఏమిటి?

మబ్బులు వీడిపోయాయి.. భవిష్యత్తు ఏమిటి?


మబ్బులు వీడిపోయాయి. భవిష్యత్తు స్పష్టంగా కనపడుతోంది. మా సినిమాకు తక్కువ టికెట్ ధరలే అమలువుతాయంటూ ప్రతి నిర్మాత ప్రకటించుకోవాల్సి వస్తోంది. అయినా అది ప్రజల్లోకి వెళ్లడంలేదు. నిర్మాత‌లు క‌థానాయ‌కుల‌కు భారీ పారితోషికాలు, సినిమా లాభాల్లో వాటాలివ్వ‌డంలాంటి చ‌ర్య‌లు, ద‌ర్శ‌కుల‌కు కూడా భారీ పారితోషికాలు, ప‌ర‌భాషా క‌థానాయికల‌కు హోట‌ల్ బిల్లుతో స‌హా చెల్లించ‌డంలాంటిచ‌ర్య‌ల‌న్నీ ప‌రిశ్ర‌మ‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికి కొన్ని కారణాలయ్యాయి. ఓటీటీని బూచిగా చూపించినప్పటికీ సినిమా బాగుండకపోతే థియేటర్లోనే కాదు.. ప్రజలు ఓటీటీల్లో కూడా చూడరు. ఈ విషయాన్ని సినీ పెద్దలు అర్థం చేసుకోవడంలేదు.

 మొదటికే మోసం తెచ్చిన భారీ పారితోషికాలు

మొదటికే మోసం తెచ్చిన భారీ పారితోషికాలు


సినిమా బడ్జెట్ భారీగా పెంచేసి, నాయకా నాయికలకు భారీ పారితోషికాలు ముట్టచెప్పి వాటిని మొదటి వారంరోజుల్లోనో, పదిరోజుల్లోనో ప్రేక్షకుల నుంచి పిండుదామనుకుంటే మొదటికే మోసం వచ్చింది. భారీస్థాయిలో నిర్మించిన బాహుబ‌లి చిత్రం విడుదలైన సమయంలో కూడా లేని టికెట్ ధరలు సాధార‌ణ సినిమాల‌కు రూ.450, రూ.350 చొప్పున పెంచేశారు. దీంతో ప్రేక్ష‌కులంతా థియేట‌ర్లవైపు రావడమే మానేశారు. భ‌విష్య‌త్తులో ఎటువంటి విప‌రిణామాలు సంభవిస్తాయో పరిశీలించుకోకుండా నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే దీనికి కార‌ణమని సినీ పరిశ్రమ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

చివరిదశలో ఉన్న సినిమాలు కూడా నిలిపివేత

చివరిదశలో ఉన్న సినిమాలు కూడా నిలిపివేత


ఆగ‌స్టు ఒక‌టో తేదీ నుంచి సినిమా షూటింగ్స్ పూర్తిగా నిలిపివేయాల‌ని పిలింఛాంబ‌ర్ నిర్ణ‌యించింది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా నిలిపేస్తుండ‌ట‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌వ‌ల్ల నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఎవ‌రూ సంతోషంగా లేర‌ని, వీట‌న్నింటికీ శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొంటామ‌ని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. సినిమా తీయాలంటే నిర్మాత డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి. షూటింగ్ ఆగిపోవడంవల్ల రోజుకు ఎంత నష్టమో వారికి అవగాహన ఉంటుంది. అయినా చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలను కూడా నిలిపివేయాలనుకోవడమే ఆశ్చర్యం కలిగించింది. నిర్మాణ వ్యయాలు అధికమై ఆర్థికంగా నష్టపోతున్నామంటున్న నిర్మాతలు తమలోనే లోపం ఉందని, అడగకపోయినా భారీ పారితోషికాలు ముట్టచెప్పడమే ప్రధాన లోపమని అవగాహన చేసుకుంటే భారీ నిర్మాతలే కాదు.. చిన్న బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలకు కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు.

English summary
The Telugu film industry is in a complete crisis.The reason for this is only one decision taken by the top directors, top producers and top actors
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X