వైయస్ జగన్ పార్టీ నేత రెహ్మాన్‌కు ఏడాది జైలు శిక్ష

ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది దండెం రాంరెడ్డి కేసు పూర్వపరాలను వివరించారు. వైయస్సార్ కాంగ్రెసు నేత, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్‌కు చెందిన హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల ఖాళీ స్థలాన్ని రామంతపూర్ నివాసి శ్రీనివాస్ గౌడ్ కొనాలని అనుకున్నారు.
శ్రీనివాస్ తన భార్య పేరు మీద కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పలు విడతలుగా రూ. 44 లక్షలు రెహ్మాన్‌కు చెల్లించారు. అయితే, కొన్నాళ్లకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. తీసుకున్న సొమ్మును తిరిగి చెల్లించడానికి రెహ్మాన్ రెండు చెక్కులను శ్రీనివాస్ గౌడ్‌కు ఇచ్చారు. కానీ ఆ చెక్కులు చెల్లలేదు.
లీగల్ నోటీసులు పంపించినా రెహ్మాన్ స్పందించకపోవడంతో శ్రీనివాస్ గౌడ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు శుక్రవారంనాడు వెలువడింది.












Click it and Unblock the Notifications