తూర్పు గోదావరిలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ.. భయాందోళనలో స్థానికులు..

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకైంది. పంట పొలాల నడుమ ఉన్న పైప్ లైన్ పగిలి.. భారీగా గ్యాస్ లీకవుతోంది. గ్యాస్ లీకేజీ గురించి తెలిసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల కి.మీ పరిధి వరకు గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. కాట్రోనికోన నుంచి మండల కేంద్రానికి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందజేశారు.

గ్యాస్ లీకైందన్న సమాచారం అందిన వెంటనే.. స్థానిక ఇళ్లకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు స్థానిక మహిళ ఒకరు చెప్పారు. గ్యాస్ స్టవ్స్ కూడా వెలిగించవద్దని,చెక్కలను మండించవద్దని చెప్పినట్టు తెలిపారు. కాగా,గ్యాస్ పైప్ లైన్ నిర్వహణ బాధ్యతలను పీహెచ్ఎఫ్ అనే సంస్థ పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం అక్కడ ఈ సంస్థ నిర్వహణ పనులు చేపడుతున్నట్టు సమాచారం. నిర్వహణ పనులు జరుగుతుండగానే పైప్ లైన్ నుంచి లీకేజీ జరిగినట్టు తెలుస్తోంది. గ్యాస్ లీకేజీ సమాచారంతో అప్రమత్తమైన ఓఎన్జీసీ అధికారులు అవసరమైన పరికరాలతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు సమాచారం.

ONGC gas pipeline leakage in east godavari district

శనివారం సఖినేటిపల్లి అంతర్వేదిలోని సెయింట్‌ మేరీ స్కూల్లో కెవి 12 బావి పైపులైన్‌ నుంచి గ్యాస్ లీకైన ఘటన మరవకముందే కాట్రోనికోనలో గ్యాస్ లీకవడం గమనార్హం. సెయింట్ మేరీస్ స్కూల్లోని కేవి 12 బావి నుంచి పెద్ద శబ్దాలతో గ్యాస్ లీకవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించడంతో.. హుటాహుటిన అక్కడికి చేరుకుని గ్యాస్‌ లీకేజ్‌ను అరికట్టారు. అయితే కేవీ 19, 3, 12 బావుల నుంచి తరుచూ గ్యాస్ లీకేజీ అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓఎన్జీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తమను ఆందోళనకు గురిచేస్తోందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+