ఒక్కటవుతున్న ప్రతిపక్షాలు- టార్గెట్ 2024 : సీఎం జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్..!!
సీఎం జగన్ ప్రత్యర్దులు ఒక్కటవుతున్నారు. మైండ్ గేమ్ మొదలు పెట్టాయి. వీరి పైన జగన్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి.
ఏపీలో రాజకీయాలు మారతున్నాయి. సీఎం జగన్ ప్రత్యర్దులు ఒక్కటవుతున్నారు. జగన్ ను ఆత్మరక్షణలోకి నెట్టటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఒకరికి మరొకరు మద్దతు ఇచ్చుకంటూ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బీజేపీతో ప్రస్తుతం కలిసి ఉన్న జనసేన వీటికి దూరంగానే ఉంటున్నా..జనసేనాని లక్ష్యం కూడా అదే. ఇక..బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటున్నా..సాధ్యపడే పరిస్థితి లేకపోవటంతో...చంద్రబాబు కొత్త పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నారు. మరి..జగన్ తమదే అధికారమని చెబుతున్నారు. జగన్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి.

పదునెక్కుతున్న ప్రత్యర్ధుల రాజకీయం
అసెంబ్లీ ఎన్నికల వేళ జగన్ లక్ష్యంగా ప్రత్యర్ధుల రాజకీయం మొదలైంది. బీజేపీ మినహా ప్రతిపక్షాలను చంద్రబాబు ఏకం చేస్తున్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపు ఇస్తున్నారు. జీవో నెంబర్ 1 కు వ్యతిరేకంగా, అంగన్ వాడీ సమస్యల పరిష్కారం కోసం మద్దతుగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో మాజీ మంత్రులు లెఫ్ట్ పార్టీలను చంద్రబాబు దగ్గర చేసుకొనే వ్యూహం ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పొత్తు ప్రకటన లాంఛనమే. బీజేపీతో కటీఫ్ కు జనసేనాని సిద్దమయయారు. చంద్రబాబుతో త్వరలో నే అధికారికంగా పొత్తు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

మైండ్ గేమ్ తీవ్రతరం
ప్రతిపక్షాలు మైండ్ గేమ్ తీవ్రతరం చేసాయి. ప్రభుత్వం వైఫల్యం అంటూ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ప్రభుత్వం పైన ప్రతిపక్ష పార్టీలు ఒకే విధంగా వ్యతిరేక వాయిస్ వినిపిస్తున్నాయి. ప్రతీ అంశం పైన విపక్షాలు కలిసి కట్టుగా ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ మాత్రం తిరిగి అధికారం పైన ధీమాగా ఉన్నారు. ప్రతిపక్షాలు తాను ప్రజలకు మంచి చేయలేదని భావిస్తే పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖా ముఖి ఎదుర్కొనే దమ్ము..ధైర్యం చంద్రబాబు..దత్త పుత్రుడుకు ఉందా అంటూ సవాల్ చేస్తున్నారు. వాళ్లలాగా తాను పొత్తుల కోసం వెంపర్లాడనని జగన్ పదే పదే తేల్చి చెబుతున్నారు. తాను నమ్ముకున్నది ఆ దేవుడిని..ప్రజలను అని స్పష్టం చేస్తున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా చివరకు మంచే గెలుస్తుందని జగన్ ధీమగా చెబుతున్నారు.

సీఎం జగన్ ఓటింగ్ మంత్ర
ముఖ్యమంత్రి జగన్ తన పాలన లో జరిగిన మంచే తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. పథకాలు కొనసాగాలంటూ వైసీపీకి మద్దతుగా నిలవాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. సీఎం జగన్ 45 నెలల పాలనలో రూ 1.98 లక్షల కోట్లు మహిళలకు సంక్షేమ పథకాల పేరుతో అందించారు. తాను చేస్తున్న సామాజిక న్యాయం అండగా నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రతీ సభలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు, నా అవ్వాతాతలు, నా అక్కచెల్లెమ్మలు, నా రైతన్నలు అంటూ ప్రధాన ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకుంటున్నారు. ఆర్దికంగా ఎన్ని కష్టాలు వచ్చినా.. చెప్పిన విధంగా ఈ వర్గాలకు తాను సంక్షేమం అందిస్తుంటే వారు ..ప్రతిపక్షాల వైపు చూడరనేది సీఎం జగన్ నమ్మకంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు సంక్షేమం గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా.. ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందనే ప్రచారంతోనే తటస్థుల్లో ప్రతికూల ఆలోచనలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో..వీటికి సీఎం జగన్ ఎలా ఎదుర్కొంటారో.. ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications